కృష్ణ

జూన్ 16 నుంచి టెంపుల్ టూరిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేటర్): వచ్చే నెల 16 నుంచి టెంపుల్ టూరిజంను అందుబాటులోకి తెస్తున్నట్టు జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా టూరిజం శాఖాధికారులతో జిల్లాలో పర్యటకులను ఆకర్షించేలా ఏర్పాటు చేసే కార్యక్రమాలపై సమీక్షించిన కలెక్టర్ శనివారం, ఆదివారం వివిధ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రజలు సందర్శించేలా రెండు టూరిజం బస్సులు ఏర్పాటవుతున్నట్టు తెలిపారు. మొదటి రూట్ బస్ విజయవాడ, వేదాద్రి, కొండపల్లి, పవిత్ర సంగమం, భవానీ ఐలాండ్, మంగళగిరి, ఉండవల్లి గుహలు, కనకదుర్గమ్మను సందర్శించే విధంగా ఉంటుందన్నారు. రెండో రూట్‌లో విజయవాడ, మంగళగిరి, యనమలకుదురు, శ్రీకాకుళం, మోపీదేవి, మచిలీపట్నం, పాండురంగస్వామి గుడి, కనకదుర్గ గుడిని సందర్శించేలా ఉంటుందన్నారు. ఈ ఆధ్యాత్మిక టూర్‌కు సంబంధించి వాటర్ బాటిల్స్, భోజనం, టీ, స్నాక్స్ కూడా టూరిజం శాఖే ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వచ్చే నెల 11 నుంచి 15 వరకూ నగరంలో స్థానికులతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని ప్రాంతాల సంప్రదాయక వంటకాలతో పాటు వివిధ రకాల నాన్‌వెజ్ వంటకాలను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి వెలగా జోషి, టూరిజం శాఖ ఈడీ ఉమామహేశ్వరరావు, కొండపల్లి బొమ్మల హార్టిజన్ అసోసియేషన్ ప్రతినిధి యూవీఆర్ ప్రసాద్, టూరిజం డీఈ గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
పెనమలూరు, మే 26: రాబోయే ఎ న్నికల్లో దశా, దిశను నిర్ణయించే తెలుగుదేశం పార్టీ మహానాడును కార్యకర్త లు విజయవంతం చేయాలని రాష్ట్ర జ లవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ క ళాశాల ఆవరణలోని మీడియా పా యింట్‌లో మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మకంగా మారిన రాబోయే ఎన్నికల్లో ప్ర తి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగపర్చుకునేలా కార్యకర్తలు, నేత లు కృషి చేయాలని సూచించారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖ మం త్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మహానాడు ఏర్పాట్లు సంతృప్తికరంగా పూర్తయ్యాయని చెప్పారు. ఆదివారం ప్రా రంభమయ్యే మహానాడులో పలు తీ ర్మానాలు ప్రవేశపెడతామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు తీసుకునే చర్యలు, ఎన్నిక ల్లో అవినీతిపరులను ఎలా తిప్పికొట్టా లి వంటి అంశాలపై చర్చిస్తామన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావ్ మాట్లాడుతూ జోన్ల వారీగా కార్యకర్తల నుండి ఎమ్మెల్యే, మంత్రుల వరకు పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలకు ముందే వ్యూహాత్మకంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాల ని సూచించారు. అనుకున్న దానికంటే ముందే మహానాడు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. మంత్రులు సో మిరెడ్డి చంద్రమోహన రెడ్డి, కాలవ శ్రీనివాసులు, సుజయకృష్ణ రంగారావు, ఎంపీ కొనకళ్ల నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, అనుమోలు ప్రభాకరరావు పాల్గొన్నారు.