కృష్ణ

అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన: పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కౌన్సిల్ సభ్యులు శనివారం జరిగిన సమావేశంలో అధికార పక్షాన్ని నిలదీశారు. మున్సిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత చర్చను ప్రారంభించిన వైసీపీ సభ్యుడు గరికముక్కు చంద్రబాబు మాట్లాడుతూ వివిధ శాఖాధిపతులు లేకుండా సమావేశాన్ని నిర్వహించటం పట్ల చైర్మన్‌ను నిలదీశారు. తన వార్డులో పనులను చైర్మన్ అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. అనంతరం చైర్మన్ ఆదేశం మేరకు అజెండాపై చర్చ జరిగింది. టీడీపీ సభ్యుడు యర్రా రాజా మాట్లాడుతూ మంచినీటి కూపన్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనిపై ఎఇ సతీష్ స్పందిస్తూ పట్టణంలో 8,700 మందికి కూపన్లు అందించామని, అవకతవకలకు అవకాశమే లేదని, దీనికి సంబంధించిన వివరాలు మా వద్ద ఉన్నాయని చెప్పారు. చైర్మన్ బండారు ఆనందప్రసాద్ మాట్లాడుతూ జిల్లాకు 3,590 మత్స్యకారుల పెన్షన్లు మంజూరయ్యాయని తెలుపుతూ పట్టణంలోని మత్స్యకారులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. సభ్యుల గౌరవ వేతనాలు కూడా ఇకపై ఆన్‌లైన్ ద్వారా సభ్యుల ఖాతాల్లో పడతాయని తెలిపారు. పట్టణంలోని మార్కెట్ ఆశీలు వసూలుకు సంబంధించి రోజువారీ రుసుములు వసూలు చేసుకునే హక్కునకు మూడు సార్లు బహిరంగ వేలం నిర్వహించినా కాంట్రాక్టర్ల స్పందన లేకపోవటంతో గత సంవత్సరం కంటే తక్కువ పాటకు టెండర్‌ను ఖరారు చేసినట్లుగా చైర్మన్ తెలిపారు. ఈ అంశంపై చంద్రబాబు డీసెంట్ ఇచ్చారు. అలాగే పట్టణంలోని మంచినీటి సరఫరా నిర్వహణకు గాను అవసరమైన సీఐడీ జాయింట్లు, ఇతర సామాగ్రి సరఫరా చేయటానికి జనరల్ ఫండ్ నుంచి రూ.లక్ష కేటాయిస్తూ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, బెజవాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.