కృష్ణ

పెడన వైసీపీ టిక్కెట్టు నాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్తివెన్ను: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు రానున్న ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైసీపీ అదనపు సమన్వయకర్త జోగి రమేష్ స్పష్టం చేశారు. ఇటీవల పెడన నియోజకవర్గ వైసీపీ అదనపు సమన్వయకర్తగా నియమితులైన జోగి శనివారం కృత్తివెన్ను మండలంలో పర్యటించారు. పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించిన ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నారు. జోగి రాకతో ఇప్పటి వరకు బలంగా ఉన్న ఉప్పాల రాంప్రసాద్ వర్గం ఒక్కసారిగా ఢీలా పడింది. నాలుగేళ్లుగా నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న రాంప్రసాద్ భవితవ్యంపై నీలి నీడలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల నియోజకవర్గంలోకి వచ్చిన జోగి రమేష్ ఉప్పాల రాంప్రసాద్‌ను కలిసి కలిసికట్టుగా పని చేద్దామని కోరారు. దీనికి ఉప్పాల నుండి సహాయ నిరాకరణ ఎదురయందని తెలిసింది. నిన్న మొన్నటి వరకు అధిష్ఠానం ఆదేశిస్తేనే పెడన నుండి పోటీ చేస్తానని చెప్పిన రమేష్ శనివారం నాటి కృత్తివెన్ను పర్యటనలో పెడన నుండే పోటీ చేస్తానని ఖరాఖండిగా చెప్పారు. దీంతో ఉప్పాల రాంప్రసాద్ వర్గానికి మింగుడు పడని అంశంగా మారింది. ఇప్పటి వరకు పెడనలో పార్టీ కోసం శ్రమించిన ఉప్పాల రాంప్రసాద్‌కు అధినేత అన్యాయం చేయరని జోగి సానుభూతి ప్రకటన చేశారు. సముచిత పదవిని అధినేత రాంప్రసాద్‌కు కట్టబెడతారని చెప్పడం విశేషం. కృత్తివెన్ను పర్యటనలో జోగికి సాదర స్వాగతం పలికారు. గత ఎన్నికల్లో మైలవరం నుండి పోటీ చేసినా తనకంటూ చెరగని ముద్ర వేసుకోవటంలో జోగి రమేష్ పాత్ర ఎంతో ఉంది. మండల పరిధిలోని పడతడిక, చిన్నగొల్లపాలెం గ్రామాలలో కార్యకర్తలతో సమావేశమైన రమేష్ రాత్రికి చిన్నగొల్లపాలెంలో బస చేశారు.