కృష్ణ

బ్యాంక్ రుణంతో పోర్టు భూముల కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: బందరు ఓడరేవు నిర్మాణానికి అవసరమైన భూములను బ్యాంక్ ద్వారా సమకూరే రుణంతో కొనుగోలు చేసి పనులను త్వరితగతిన ప్రారంభిస్తామని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు స్పష్టం చేశారు. ఓడరేవు నిర్మాణ పనులపై శనివారం వారు జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్‌తో కలిసి విజయవాడలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోర్టు నిర్మాణం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఓడరేవు నిర్మాణానికి అవసరమైన భూములను కొనుగోలు చేసేందుకు బ్యాంక్ నుండి ప్రభుత్వ హామీతో రుణం పొందనున్నట్లు తెలిపారు. రూ.1092కోట్ల మేర రుణం ఇచ్చేందుకు విజయ బ్యాంక్ ముందుకు వచ్చిందని, త్వరలోనే కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. మార్కెట్ విలువ ప్రకారం భూముల కొనుగోలు జరుగుతుందన్నారు. కలెక్టర్ బి లక్ష్మీకాంతం మాట్లాడుతూ పోర్టు భూముల కొనుగోళ్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ముడ అధికారులను ఆదేశించారు. జూన్, జులై మాసాల్లో కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ముడ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నామన్నారు. పోర్టు అభివృద్ధికి పోర్టు ఏరియా, పారిశ్రామిక నడవ, టౌన్‌షిప్ ఏర్పాటుకు సూక్ష్మ ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న ముడ పరిధిని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు వివరించారు. తొలుత ముడ వైస్ ఛైర్మన్ పి విల్సన్ బాబు పోర్టు అభివృద్ధి, కొనుగోళ్ల పథకం అమలు, మాస్టర్ ప్లాన్ తయారీ, ముడ పరిధి విస్తరణ తదితర అంశాలపై సమగ్ర సమాచారంతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బిఆర్ అంబేద్కర్, ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు, ముడ ప్లానింగ్ అధికారి శిల్ప తదితరులు పాల్గొన్నారు.