కృష్ణ

క్రీడాకారులే ప్రపంచ ఛాంపియన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్): ఎరికైనా ప్రపంచ చాంపియన్ అయ్యే అవకాశం కేవలం క్రీడల్లో మాత్రమే ఉందని, మరే ఇతర రంగాల్లో లేదని ప్రముఖ స్టార్ షెట్లర్, అర్జున అవార్డు గ్రహీత జ్వాలా గుత్తా అన్నారు. ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్‌టౌన్ ఆధ్వర్యంలో బందరురోడ్డులోని హోటల్ గేట్ వేలో ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహకులు జ్వాలా గుత్తా, సైంట్ లిమిటెడ్ కార్పొరేట్ అఫైర్స్ అధ్యక్షులు బి అశోక్‌రెడ్డిలకు ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జ్వాలా గుత్తా మాట్లాడుతూ తాను పాఠశాలలో పీఈటీ క్లాసులో చేసిన వ్యాయామం ఇప్పటికీ గుర్తుంటుందన్నారు. క్రీడలపై ఆసక్తి ఉంటే ఎక్కడైనా రాణించగలరని అన్నారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ పరంగా మంచి ప్రోత్సహకాలు లభిస్తున్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు మళ్ళించే విధంగా చేస్తున్నారన్నారు. విద్యార్ధి దశ నుండే క్రీడల వైపు ఆసక్తి కలిగేలా తల్లిదండ్రులు కృషి చేయాలని సూచించారు. క్రీడా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్న వారు మంచి పౌరులుగా దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తారన్నారు. మరో అవార్డు గ్రహీత అశోక్‌రెడ్డి మాట్లాడుతూ టీమ్ వర్క్ ఉంటే ఎదైనా సాధించగలమన్నారు. మన జీవితంలో విలువలు చాలాముఖ్యమైనవి అని అన్నారు. తాను ఫస్ట్ అనే సూత్రాన్ని నమ్ముతానని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడలు అవసరమన్నారు. హైదరాబాద్, కాకినాడ ప్రాంతాల్లో 25 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని వాటిల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రతి విద్యార్థికి పూర్తిస్థాయి చదువు అందించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. శాప్ చైర్మన్ పి అంకమ్మ చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి 300 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఈ రోజుల్లో క్రీడాకారులే స్టార్స్ అది సినీమా వాళ్లు కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ మిడ్‌టౌన్ క్లబ్ కార్యదర్శి పార్థసారథి, అధ్యక్షులు సతీష్ చంద్ర, పలువురు కబ్ల్ సభ్యులు పాల్గొన్నారు.

దుర్గమ్మ సేవలో కలెక్టర్
ఇంద్రకీలాద్రి, జూన్ 17: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ఆదివారం ఉదయం కలెక్టర్ బీ లక్ష్మీకాంతం దం పతులు దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. వీరికి సహా య ఈవో శ్రవణం అచ్యుత రామయ్యనాయుడు ఆలయ మర్యాదలతో స్వా గతం పలికారు. అమ్మవారి దర్శనం త ర్వాత వీరికి అర్చకులు దివ్య ఆశీస్సులి చ్చి ప్రసాదాలను అందచేశారు.