కృష్ణ

కృష్ణానదిలో గుర్రపుడెక్క తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఇటీవల కృష్ణానది ఒడ్డున దుర్గాఘాట్ పరిసర ప్రాంతాల్లో రోజురోజుకీ పేరుకుపోతున్న గుర్రపుడెక్కను జలవనరుల శాఖ అధికారులు పొక్లెయిన్ల సహాయంతో తొలగింపు కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ బీ లక్ష్మీకాంతం కూడా జలవనరుల శాఖ అధికారులను ఇటీవల క్యాంపు కార్యాలయానికి పిలిపించి గుర్రపుడెక్కను సాధ్యమైనంత త్వరగా తొలగించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆయన పనులు జరిగే ప్రాంతాన్ని సందర్శించి తొలగింపు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గుర్రపుడెక్క కృష్ణానదిలో విస్తరించి ఉన్న విషయం ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నందున రెండు, మూడు రోజుల్లో మొత్తం ప్రాంతం అంతా క్లియర్ చేసి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆయన ఆదేశించారు. సోమవారం ఉదయం నుండి 200 మంది మత్స్యకార నిపుణులను గుర్రపుడెక్కను తొలగింపునకై అదనంగా వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పర్యటనలో జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, అధికారులు, పోలీసులు, ఎండోనె్మంట్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ ఇన్‌స్పెక్షన్ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లోని పారిశుద్ధ్య పరిస్థితులపై సమీక్షించిన కారణంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదివారం ఉదయం దుర్గాఘాట్, రైతుబజార్, కోర్టులు, పీడబ్ల్యుడీ గ్రౌండ్స్‌ను తనిఖీ చేశారు. ఆయా ప్రాంగణాల్లో పారిశుద్ధ్యం మెరుగుదలకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్‌తోపాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.