కృష్ణ

సామూహిక దరఖాస్తుల సమర్పణ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: సీపీఐ పిలుపు మేరకు సోమవారం జరిగిన సామూహిక దరఖాస్తుల సమర్పణ కార్యక్రమం విజయవంతమయింది. అర్హులైన వారందరికీ వెంటనే ఇంటి స్థలాలు మంజూరు చేసి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, రేషన్‌కార్డులు ఇవ్వాలని, పేదల స్వాధీనంలో ఉన్న ఇళ్ల స్థలాలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, పెండింగ్‌లోని ఇంటి స్థలం, పక్కా ఇళ్ల అర్జీలన్నీ వెంటనే పరిష్కరించాలని, పేదల నివాస ప్రాంతాల్లో రక్షిత మంచినీరు, ఇతర వౌలిక సదుపాయాలు కల్పించాలని, పేదలందరికీ రూ. 3వేలు పెన్షన్ ఇవ్వాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు చిత్తశుద్ధితో అమలు చేయాలని, పేదలందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందించాలని, జన్మభూమి కమిటీలు రద్దు చేయాలని, ప్రభుత్వం ఆమోదించిన కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 325కు పైగా కేంద్రాల్లో ధర్నాలు, సామూహిక దరఖాస్తుల సమర్పణ కార్యక్రమాలు జయప్రదంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో పేద ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తహశీల్దార్‌లకు అర్జీలు సమర్పించారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, గుంటూరు జిల్లా సీపీఐ కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏజె స్టాలిన్‌లు పాల్గొనగా నర్సీపట్నంలో విశాఖ జిల్లా పార్టీ కార్యదర్శి బాలేపల్లి వెంకట రమణ పాల్గొన్నారు. విజయవాడలో జరిగిన ముట్టడి కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జల్లి విల్సన్, నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీ దుర్గ్భావాని, నగర సహాయ కార్యదర్శి జీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్టవ్య్రాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా కేంద్రాల్లో స్థానిక నాయకులు పాల్గొన్నారు.