కృష్ణ

ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: మన చుట్టు పక్కల ఉన్న ప్రతికూల పరిస్థితులను సైతం మనకు అనుకూలంగా మలచుకోవాలని మైలవరం సీఐ రామచంద్రరావు అన్నారు. కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్థానిక నూజివీడురోడ్‌లో జరుగుతున్న యువతీ, యువకులకు వివిధ వృత్తులకు సంబంధించి జరుగుతున్న శిక్షణా శిబిరాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. తరగతులు జరిగే విధానం, సీసీ కెమేరాల ఏర్పాటును పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యునికేషన్ స్కిల్స్, మోరల్ వ్యాల్యూస్‌పై ఆయన శిక్షణకు హాజరైన వారితో మాట్లాడారు. నైతిక విలువలను ఎలా పెంపొందించుకోవాలి, సమాజంలో జరుగుతున్న విషయాలు, ఉద్యోగాలు ఎలా సంపాదించాలి, పరిపూర్ణ మహిళా సాధికారిత ఎలా సాధించాలనే అంశాలను వివరించారు. మహిళా కానిస్టేబుల్స్‌ను ఈ శిక్షణా శిబిరానికి తీసుకువచ్చిన సీఐ వారితో కూడా మహిళలు ఎలా మెలగాలి, వారి కాళ్ళపై వారు ఎలా నిలబడాలి, కుటుంబ పోషణ ఎలా చేసుకోవాలని ఉద్యోగాలు ఎలా సంపాదించుకోవాలి అనే అంశాలపై వివరింపజేశారు. మహిళా కానిస్టేబుల్స్ మాట్లాడుతూ తాము జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నదీ, కుటుంబానికి తాము భారం కాకుండా తాము కూడా ఎలా ఉద్యోగాలు సంపాదించుకున్నదీ వివరించారు. అప్పటికప్పుడు ఎదురయ్యే తాత్కాలిక ఇబ్బందులను ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేశారు. శిక్షణా తరగతుల ఇన్‌చార్జ్ కోయ సుధ మాట్లాడుతూ మైలవరంలో ఇటువంటి శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నందున వాటిని యువతీ, యువకులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలన్నారు. బ్యూటిషియన్ కోర్సు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ వంటి పలు అంశాలపై శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా వసతి, భోజనం ఏర్పాటు చేయటంతోపాటు శిక్షణ అనంతరం సర్ట్ఫికెట్ అందించటం, ఉద్యోగావకాశాలు కల్పించటం జరుగుతుందన్నారు. రోజుకు 8 గంటల పాటు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని వివరించారు. ఈకార్యక్రమంలో మదర్ ధెరిస్సా మహిళా మండలి సభ్యులు శే్వత, మల్లేశ్వరి, ధీరజ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.