కృష్ణ

ట్రేడర్స్‌కు ఈ-పర్మిట్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: వర్తక, వాణిజ్యం చేసే వ్యాపారులు జూల్ 1 నుండి తప్పని సరిగా తమ సరుకు రవాణాకు సంబంధించి ఈ - పర్మిట్ తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ జేడీ రామాంజనేయులు స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మైలవరం, తిరువూరు నియోజకవర్గాలకు సంబంధించిన వర్తకులకు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ వర్తకులు తమ సరుకును ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి సరఫరా చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పర్మిట్ తీసుకోకపోతే వారి వాహనాలను అనుమంతించేది లేదన్నారు. పర్మిట్ తీసుకున్న వాహనాల అనుమతి పత్రాన్ని వారి వాహనాలకు తగిలించాలని దీని వల్ల చెక్ పోస్ట్‌ల వద్ద ఎటువంటి ఆటంకం లేకుండా అనుమతించబడుతుందన్నారు. ప్రతి ఒక్క ట్రేడర్ దీనిని తప్పని సరిగా పాటించాలన్నారు. దీని వల్ల దళారీ వ్యవస్థను రూపుమాపే అవకాశం ఏర్పడుతోందన్నారు. ట్రేడర్స్ తమకు కావాల్సిన ఈపర్మిట్, లైసెన్స్‌లను వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా పొందవచ్చన్నారు. వీటిని ఎలా పొందాలనే విషయాలను, ఫీజుల వివరాలు, షరతులు, దరఖాస్తులు పొందే విధానం తదితర అంశాలను స్క్రీన్ ద్వారా చూపించారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ఉయ్యూరు వెంకట నరసింహారావు, మార్కెటింగ్ శాఖ డీడీ దివాకర్, ఏడి రవిశంకర్, మైలవరం ఏఎంసి కార్యదర్శి ఆంజనేయులు, సహాయ కార్యదర్శి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

దేవరపల్లిలో గడ్డివాములు, పశువుల పాకలు దగ్ధం

తోట్లవల్లూరు, జూన్ 19: మండలంలోని దేవరపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో 3 ఎకరాల వరిగడ్డి వాము, 2 పశువుల పాకలు, కంద, పసుపు విత్తన రాశులు దగ్దమై రూ.3లక్షల ఆస్తినష్టం జరిగింది. మాజీ మండల టీడీపీ అధ్యక్షుడు అంజిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన గడ్డివాములు దగ్దమయ్యాయి. మధ్యాహ్నం సమయంలో కాల్వ చిన్నకట్ట వైపు నుంచి మంటలు వచ్చి వరిగడ్డి వామునకు అంటుకున్నట్టు చెపుతున్నారు. తీవ్రమైన ఎండవేడిమితో మంటలు ఒకసారి ఎగసిపడి వరిగడ్డి వాము, పాకలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమయింది. మొవ్వ మండలం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక వాహనం వచ్చే లోపే అప్పటికే అంజిరెడ్డి, వారి కుటుంబ సభ్యుల 25 ఎకరాల వరిగడ్డి వాములు పూర్తిగా మంటల్లో చిక్కుకున్నాయి. జేసీబిని తీసుకువచ్చి చెత్తను పెకలిస్తు మంటలను ఆర్పుతున్నారు. పాకల్లో విత్తనం కోసం నిల్వచేసిన 54 పుట్టి పసుపు, 60 పుట్టి కంద గుట్టలు మంటలకు మగ్గిపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తం రూ.3లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని మొవ్వ అగ్నిమాపక అధికారి రాంబాబు తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని తహశీల్దార్ జి భద్రు, ఎస్‌ఐ మురళీ పరిశీలించారు.