కృష్ణ

ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం కలిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రభుత్వ వైద్య సేవల పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించేలా వైద్యులు వ్యవహరించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. మంగళవారం ఆమె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వివిధ విభాగాలను తనిఖీ చేసిన ఆమె రోగులకు అందుతున్న వైద్య సేవలపై వాకబు చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందన్నారు. లక్షల కోట్ల మేర వైద్య రంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నారన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు గతం కన్నా మెరుగుపడ్డాయన్నారు. మచిలీపట్నం పరిసర ప్రాంతాల నుండి వచ్చే ఎమర్జన్సీ కేసులను విజయవాడ తరలిస్తుండటం పట్ల ప్రజల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. ప్రతి చిన్న కేసును కూడా విజయవాడ తరలిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, వీటిని సరి చేసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి కేసును విజయవాడ తరలిస్తుండటం వల్ల అక్కడి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయన్నారు. ఏమైనా లోటుపాట్లు ఉండే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకుని వౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి వైద్యుడి పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించి వారిలో మనో ధైర్యాన్ని నింపే విధంగా వైద్య సేవలు అందించాలన్నారు. ఆర్థో విభాగంలో లక్ష్యానికి మించి శస్త్ర చికిత్సలు నిర్వహించి జాతీయ స్థాయి అవార్డు పొందడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఆమె వెంట జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, ఆర్‌ఎంఓ డా. అల్లాడ శ్రీనివాసరావు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు అంగర తులసీదాస్, రాజు, అబ్దుల్ అజీమ్ ఉన్నారు.