కృష్ణ

ప్రయాణీకులకు చుక్కలు చూపించిన ఎయిర్ ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ: దేశ రాజధాని ఢిల్లీ నుండి రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని గన్నవరానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా 457 నెంబర్ విమా నం శనివారం రాత్రి ప్రయాణికులకు ము చ్చెమటలు పట్టించిందని ప్రయాణికులు తెలిపారు. ఢిల్లీ నుండి గన్నవరానికి శనివారం సాయంత్రం 5.45కి బయలుదేరాల్సిన విమానం రాత్రి 8 గం టలకు బయలు దేరింది. సాంకేతిక లోపాలతో విమానం కుదుపులకు గురైంది. దాంతో పైలెట్ విమానాన్ని హైదరాబాద్‌కి మళ్లించి అర్ధరాత్రి 12. 15కి ల్యాండింగ్ చేశాడు. అనంతరం దానికి మరమ్మతులు చేయించాక ఆదివారం తెల్లవారుజామున అర్ధరాత్రి దా టాక 2 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. ఈలోగా ప్ర యాణికులు భయకంపితులయ్యారు. సుమారు 150 మంది ప్రయాణికులు గుప్పిట గుండెను పట్టుకుని ఆందోళనకు గురయ్యామన్నారు. విమానంలో ఐఏఎస్ ఆఫీసర్ నరసింహరావు, విజయవాడ గాంధీజీ మహిళా కళాశాల క రస్పాండెంట్ సీఎల్ కాంతారావు, దుగ్గిరాల కళాశాల లెక్చరల్ దారబోయిన వెంకటేశ్వరరావు, నగర బీజేపీ ఉపాధ్యక్షుడు సూరె వెంకట సుబ్బారావు ఆ విమానంలో ప్రయాణించారు. కాగా సాంకేతిక లోపాలు ఉన్న విమానాల ను ఉపయోగించడం, ప్రయాణికుల ను ఇలా భయభ్రాంతులను చేయడం సరైంది కాదని నగర బీజేపీ నేత సూరె వెంకట సుబ్బారావు అన్నారు.