కృష్ణ

‘సంజీవని’కి విరాళాల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: నాట్యక్షేత్రం కూచిపూడిలోని పసుమర్తివారి ధర్మచెరువులో సిలికానాంధ్ర వసుధైక కుటుంబం నిర్మిస్తున్న సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయం నిర్మాణానికి విరాళాల సేకరణలో భాగంగా ఆదివారం కూచిపూడిలో నిర్వహించిన సంజీవని ధాన్ కార్యక్రమం సందర్భంగా దాతలు కోటి రూపాయల విరాళాలను అందచేశారు. కూచిపూడి, విజయవాడ, హైదరాబాద్‌లలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా రూ.12.15 కోట్లు విరాళాలుగా అందినట్లు సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, కూచిపూడి నాట్యారామ కమిటీ చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా మండవ బాలాత్రిపుర సుందరి, పసుమర్తి మోహన మురళీకృష్ణ, యార్లగడ్డ సుబ్రహ్మణ్యం ఒక్కొక్కరు రూ.6లక్షలు చొప్పున, సూరపనేని బీబి సరోజిని రూ.10లక్షలు, మండల వైస్ ఎంపీపీ నన్నపనేని వీరేంద్ర రూ.3.5లక్షలు, కొండవీటి అమరబాలేశ్వరరావు, షేక్ షౌకత్ ఆలీ రూ.3లక్షల వంతున, కాజ చిన్న నాగేశ్వరరావు రూ.4లక్షలు, వలివేటి దుర్గా నాగేశ్వరరావు రూ.2లక్షలు, పలువురు దాతలు రూ.లక్ష నుండి రూ.3,500 వరకు విరాళాలు ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా దివిసీమలోని ఏడు మండలాలతో పాటు పమిడిముక్కల, పామర్రు, పెదపారుపూడి, తోట్లవల్లూరు మండలాల్లోని ప్రజల సౌకర్యార్ధం రూ.2.50 కోట్లతో 10 అత్యంత ఆధునికమైన అంబులెన్స్‌ల కొనుగోలుకు విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిలారపు మంగమ్మ, టీడీపీ మండల అధ్యక్షుడు తాతా వీర దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పట్టిసీమను సందర్శించిన మైలవరం ముస్లింలు

మైలవరం, జూన్ 24: కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసిన ప్రతిష్టాత్మకమైన పట్టిసీమ, పోలవరం, చింతలపూడి ప్రాజెక్టులను ఆదివారం మైలవరానికి చెందిన ముస్లిం మైనారిటీ సోదరులు సందర్శించారు. మైలవరం పట్టణ టిడిపి ఉపాధ్యక్షులు షేక్ సుభాని నేతృత్వంలో ముస్లిం మైనారిటీ సోదరులు సుమారు 50 మంది ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్ళారు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచన మేరకు వీరు పట్టిసీమ, చింతలపూడి, పోలవరం ప్రాజెక్టులను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పోలవరం రాష్ట్రానికి జీవనాడి వంటిదన్నారు. అదేవిధంగా పట్టిసీమ వల్లే కృష్ణా డెల్టాలో లక్షలాది ఎకరాల పంట సాగు జరిగిందన్నారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలమేనన్నారు. అదేవిధంగా చింతలపూడి ఎత్తిపోతల పధకం పూర్తయితే కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలోని మెట్ట భూములన్నీ మాగాణి భూములుగా మారతాయని అభిప్రాయపడ్డారు. ఆధునిక యంత్ర పరికరాలతో కేంద్రం సహకరించకపోయినా పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిదేవినేని ఉమామహేశ్వరరావుకు వారు అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో ముస్లిం సోదరులు ఖాజా, కరీం, సుభాని, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రధాన కాలువకు జలకళ

బంటుమిల్లి, జూన్ 24: వేసవి తీవ్రతతో ప్రజలు తాగటానికి నీరు లేక అల్లాడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని విడుదల చేయడంతో బంటుమిల్లి ప్రధాన కాలువకు జల కళ వచ్చింది. మల్లేశ్వరం వంతెన వద్ద నాలుగున్నర అడుగుల నీటి మట్టంతో ప్రధాన కాలువ ఉంది. బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లోని అన్ని గ్రామాల మంచినీటి చెరువులలో నీరు నింపుకునే అవకాశం వచ్చింది. గుడ్లవల్లేరు లాకులు వద్ద 685 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఇరిగేషన్ ఎఇ రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ నీరు గోదావరి ఫ్లడ్ వాటర్ అని, ఎంత కాలం ఇచ్చేది తెలియదని, వచ్చినంత కాలం కాలువకు నీరు ఇవ్వటం జరుగుతుందన్నారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, సెక్రటరీలు సమిష్టి కృషితో గ్రామాల్లోని మంచినీటి చెరువులను నింపుకోవాలని రాజ్యలక్ష్మి తెలిపారు. నీటి విడుదల విషయంలో పీయుసీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్, మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ విశేష కృషి చేశారు.

ఎస్సీల సంక్షేమానికి కోట్లు ఖర్చు చేశాం

*బచ్చుల అర్జునుడు

పామర్రు, జూన్ 24: రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.29,440 కోట్లు ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం నిధులు కేటాయించి ఖర్చు చేసిందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు స్పష్టం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనతో కలిసి ఆయన విలేఖర్లతో ఆదివారం మాట్లాడారు. గత ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు సబ్ ప్లాన్ నిధులను నేరుగా దళితుల సంక్షేమానికి వినియోగించారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు రోడ్లు, మురుగునీటి కాలువలు, మంచినీటి సౌకర్యాలు కల్పించామని వివరించారు. దళితతేజం పేరిట ప్రతి దళిత కుటుంబాన్ని పలకరించి సంక్షేమాన్ని చూస్తున్నామన్నారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ లాజరస్, దుర్గగుడి కమిటీ డైరెక్టర్ పామర్తి విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు.