కృష్ణ

నిజాయితీ కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): నీతి, నిజాయితీ, విద్యార్హత, సమాజం పట్ల బాధ్యత కలిగిన యువత రాజకీయాల్లోకి రావల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. కీ.శే. బూరగడ్డ నిరంజనరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కన్యకాపరమేశ్వరి సత్రంలో రాజకీయ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ వైద్యుడు డా. బూరగడ్డ శ్రీనాధ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేదవ్యాస్ మాట్లాడుతూ అపారమైన యువశక్తి కలిగిన భారతదేశం అభివృద్ధిలో వెనుకంజ వేస్తోందన్నారు. యువత సామాజిక స్పృహతో పాటు రాజకీయంగా తెర మీదకు వచ్చినప్పుడే దేశాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ప్రముఖ వైద్యుడు డా. బి ధన్వంతరి ఆచార్య, సీనియర్ న్యాయవాది కాళీపట్నం భీమశంకరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా వాలిశెట్టి వెంకటేశ్వరరావు (బాబు) స్వాగత ఉపన్యాసం చేశారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ప్రాథమిక హక్కులు, నిర్వర్తించవల్సిన ప్రాథమిక బాధ్యతలు, రాజకీయ హక్కులు, ఓటు హక్కుల ప్రాధాన్యత, రాష్ట్భ్రావృద్ది-ప్రత్యేక హోదా ఆవశ్యకతను పట్టణ న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ తెలియచేశారు. భారత దేశ రాజకీయ నిర్మాణం, ఎన్నికల ప్రక్రియ ఓటుకు నోటు అభివృద్ధికి అవరోధం అంశంపై సుంకర రమేష్, సమచార హక్కు చట్టంపై న్యాయవాది పుప్పాల హరిబాబు, సామాజిక సంస్కరణలు-అభివృద్ధిలో యువకుల పాత్రపై గడ్డం రాజు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అన్నపరెడ్డి వెంకట స్వామి, సూరిశెట్టి ఆనంద్, రేపల్లె సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ పాలన జగన్‌తోనే

* వైసీపీ జిల్లా అధ్యక్షుడు సారథి

తోట్లవల్లూరు, జూన్ 24: రాష్ట్రంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి పరిపాలన రావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే సాధ్యమవుతుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి అన్నారు. మండలంలోని భద్రిరాజుపాలెంలో ఆదివారం రాత్రి మండల వైసీపీ బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశం ఎంపీపీ కళ్ళం వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సారధి మాట్లాడుతూ ఎన్నికల్లో బూత్ కమిటీ కన్వీనర్‌లదే కీలక పాత్రని, ఆయా వార్డులోని ప్రతి ఓటరు వివరాలు సమగ్రంగా తెలుసుకుని ఉండాలని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం టీడీపీ అనేక అక్రమాలు చేసేందుకు సిద్దంగా ఉందని, అందుచేత బూత్ కమిటీ కన్వీనర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. పామర్రు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి కైలే అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఇక నుంచి ప్రతినెలా బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశం నిర్వహిస్తామన్నారు. సంస్థాగతంగా పార్టీ బలంగా ఉంచటంతో బూత్ కమిటీల పనితీరుపైనే ఆధారపడి ఉందన్నారు. గత ఎన్నికల్లో వెయ్యి ఓట్ల మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేకు వచ్చిందని, అందుచేత ప్రతి ఓటు ఎంతో అమూల్యమైనదిగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు తాతినేని పద్మావతి, మండల వైసీపీ అధ్యక్షుడు జొన్నల రామ్మోహన్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ వల్లూరు విమలమ్మ తదితరులు పాల్గొన్నారు.