కృష్ణ

ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గంజి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన కమిటీ సభ్యులతో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఆసుపత్రి అభివృద్ధి, రోగుల పరిస్థితి, మందుల పంపిణీ, వైద్య సేవలపై వారితో చర్చించారు. ఆనంతరం విలేఖర్లతో చైర్మన్ కృష్ణారెడ్డి, డైరెక్టర్లు కామిశెట్టి వెంకట నరసయ్య, పటాపంచల నరశింహారావు, విజయలక్ష్మిలు సమావేశ వివరాలను వివరించారు. 70 వేల రూపాయల వ్యయంతో ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దోమలు వార్డులలోకి రాకుండా అన్ని కిటికీలకు మెష్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఆసుపత్రిలోని వార్డుల డోర్‌లకు కర్టెన్‌లను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో రోగులకు అవసరమైన మందులు కొన్ని కొరతగా ఉన్న విషయాన్ని గుర్తించి వాటిని బయటి నుండి కొనుగోలు చేసి రోగులకు అందిస్తున్నట్లు వివరించారు. చిన్న పిల్లల వార్డులను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిరంతరం ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యుత్ మరమ్మతులు జరిపించి, వైద్యపరికరాలను, యంత్రపరికరాలను మరమ్మతులు జరిపిస్తున్నట్లు తెలిపారు. వైద్యశాల ఆవరణలో డ్రైనేజీలను శుభ్రపరచాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు తక్షణ వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించామన్నారు. ఈసమావేశంలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కె సహనం, డాక్టర్ శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

బిసి రెసిడెన్షియల్ స్కూల్‌కు స్థలాన్ని కేటాయించాలి

మైలవరం, జూలై 16: మైలవరానికి మంజూరైన బిసి రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి అవసరమైన పది ఎకరాల స్థలాన్ని కేటాయించాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైలవరం నియోజకవర్గ అధ్యక్షులు కాగిత అజయ్ కుమార్ కోరారు. ఈమేరకు సోమవారం స్థానిక తహశీల్దార్ పి పుల్లయ్యను కలిసి వినతి పత్రాన్ని అందించారు. బిసిలకు ఆరు నుండి 9వ తరగతి వరకూ రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహాన్ని మంజూరు చేయటం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఇటీవల మైలవరం పట్టణంలో మంజూరైన బిసి భవన నిర్మాణానికి ఏడు సెంట్ల స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వటం పట్ల తహశీల్దార్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు వేముల ప్రకాష్ కూడా పాల్గొన్నారు.