కృష్ణ

చైర్మన్ రాజీనామా ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు: ఎట్టకేలకు మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు రాజీనామాను మున్సిపల్ కౌన్సిల్ మంగళవారం ఆమోదించింది. ప్రస్తుత చైర్మన్ జంపాన అధ్యక్షతన నగర పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్‌ల రాజీనామాలపై చర్చించి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు వై.వి.బి రాజేంద్రప్రసాద్, పెనమలూరు శాసన సభ్యులు బోడే ప్రసాద్ హాజరయ్యారు. కమిషనర్ రాంకుమార్ చైర్మన్ల రాజీనామల విషయాన్ని సభ్యులకు చదివి వినిపించగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. నూతన చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయిన తరువాత నామినేషన్‌లు స్వీకరిస్తామని కమీషనర్ తెలిపారు. నోటిఫికేషన్ జారీకి పది రోజుల సమయం పట్టవచ్చునని భావిస్తున్నారు. అనంతరం ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సిలు పట్టణంలోని పలువార్డులలో కౌన్సిలర్‌లతో కలసి పర్యటించారు. ఈ సంధర్భంగా ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్న వారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వారి మన్ననలు చూరగొనాలని సూచించారు.

ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి

గుడివాడ, జూలై 17: గుడివాడ డివిజన్‌లోని నందివాడ, మండవల్లి మండలాల్లో భూస్వాములు, మాజీ ప్రభుత్వ ఉద్యోగుల ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్‌సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట మండవల్లి మండలం నందిగామలంక గ్రామానికి చెందిన దళితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ కార్యాలయాల్లో రికార్డులు లేవని, ఆక్రమణదారుల దగ్గర ఉన్నాయన్నారు. నందిగామలంక గ్రామానికి చెందిన కొల్లేరు భూమి ఆక్రమణలకు గురైందన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.