కృష్ణ

స్టేడియం నిర్మాణానికి ముహూర్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మచిలీపట్నంలో ఇండోర్ అండ్ ఔట్‌డోర్ స్టేడియం నిర్మాణ కల సాకారం కాబోతోంది. రూ.15కోట్లతో నిర్మించతలపెట్టిన స్టేడియం నిర్మాణానికి ఈ నెల 24న శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం ఖరారైంది. స్థానిక చల్లపల్లి బైపాస్ రోడ్డులోని గో సంఘంకు చెందిన 10 ఎకరాలలో స్టేడియంను నిర్మించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక కృషితో పట్టణంలో ఇండోర్ అండ్ ఔట్‌డోర్ స్టేడియం నిర్మాణానికి ముందుకు వచ్చింది. 24వ తేదీన నిర్వహించనున్న శంకుస్థాపనకు ప్రముఖ క్రికెటర్ అనీల్ కూంబ్లే ముఖ్య అతిథిగా రానున్నారు. ఇండోర్ స్టేడియం శంకుస్థాపనతో పాటు జిల్లా పరిషత్ సెంటరులో భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్, బందరు వాసి అయిన సికె నాయుడు విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారు. అనీల్ కూంబ్లే పర్యటన నేపథ్యంలో మంగళవారం మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. సికె నాయుడు విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించి స్థల పరిశీలన జరిపారు. ఈ సందద్భంగా మంత్రి మాట్లాడుతూ స్టేడియం నిర్మించాలన్న ఈ ప్రాంత యువత చిరకాల వాంఛ త్వరలోనే నెరవేరబోతుందన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.