కృష్ణ

ట్రిపుల్ ఐటీల్లో ప్రపంచస్థాయి విద్యాబోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలో నడుస్తున్న ట్రిపుల్ ఐటీలలో ప్రపంచస్థాయి విద్యాబోధన జరుగుతోందని విశ్వవిద్యాలయం కులపతి రాజ్‌రెడ్డి చెప్పారు. గురువారం ఉదయం నూజివీడు ట్రిపుల్ ఐటీని ఆయన సందర్శించి, మెంటర్లతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీలలో గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు ప్రవేశం కల్పించి, వారికి ప్రపంచస్థాయి విద్య అందించటం ప్రధాన లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులకు రాజ్‌రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వీరంకి వెంకటదాసు, శ్రీ హరరాములు, ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.