కృష్ణ

కేంద్రంపై అవిశ్వాసం గెలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి: పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంలో తాము విజయం సాధిస్తామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు అన్నారు. మండల పరిధిలోని మోపిదేవిలో గురువారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీపై అవిశ్వాస తీర్మానంతో ఆయన నియంత పోకడలకు కళ్లేం పడుతుందని, బీజెపీ సభ్యులే ఆయన విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నందున వారు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తారని అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారానికే గ్రామదర్శిని నిర్వహించటం జరుగుతుందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా మంచినీరు, సాగునీరు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో మండలి రాజా, బచ్చు వెంకట నాధ ప్రసాద్, జెడ్పీటీసీ వెంకటేశ్వరరావు, ఎంపీపీ బండి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మహిళలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరగా ఆర్జునుడు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

స్వార్థం కోసమే కేంద్రంపై విమర్శలు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు

అవనిగడ్డ, జూలై 19: కేంద్రం నుండి పెద్ద ఎత్తున సహకారం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్ధ రాజకీయాల కోసం బీజెపీపై విమర్శలు చేయడం ఆయన కుట్ర రాజకీయాలను బహిర్గతం చేస్తున్నాయని జిల్లా బీజెపీ అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి అన్నారు. స్థానిక బీజెపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్ భోగాది చంద్రశేఖర్ అధ్యక్షతన సమావేశం జరగ్గా కుమారస్వామి రాష్ట్ర ప్రభుత్వ పనితీరును తీవ్రంగా దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో బీజెపీకి శాశ్వత పాలన పగ్గాలు అప్పగించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందన్నారు. పోలవరం నిర్మాణంలో వందలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం కావటమే గాక తెలుగుదేశం పార్టీ నేతలు నిధులు స్వాహా చేశారన్నారు. కార్యక్రమంలో బీజెపీ నేతలు పంతం వెంకట గజేంద్రరావు, భోగాది రమాదేవి, జివి నగరాయులు తదితరులు పాల్గొన్నారు.

మొవ్వ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో
పెరగనున్న భూముల ధరలు

కూచిపూడి, జూలై 19: రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు భూముల ధరలు పెంచేందుకు చేపడుతున్న చర్యలు కారణంగా ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభిస్తుంది. భూముల ధరలు ఆయా గ్రామాల ప్రాముఖ్యతను బట్టి 1 నుండి 5శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయిస్తోంది. దీని ఫలితంగా మొవ్వ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఏడాదికి సుమారు రూ.21లక్షల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది భూముల ధరలు పెంచటంతో ఏడాది కేవలం మూడు నుండి ఐదు శాతం భూముల ధరలు పెంచి రిజిస్ట్రేషన్‌లు ద్వారా సుమారు రూ.7.5కోట్లు ఆదాయం లభించే అవకాశం ఉందని సంబంధితశాఖాధికారులు పేర్కొంటున్నారు. మొవ్వ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో మొవ్వ, ఘంటసాల మండలాలు మొత్తం, చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో ఏడేడు గ్రామాలు వస్తాయి. త్వరలో భూముల ధరలు పెరగనున్న కారణంగా అమ్మకం దారులు, కొనుగోలుదారులతో రిజిస్ట్రార్ కార్యాలయాలు కళకళలాడుతున్నాయి.