కృష్ణ

యలవర్తిని దించేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: గుడివాడ మున్సిపల్ చైర్మన్ పదవి నుండి యలవర్తి శ్రీనివాసరావును దించేస్తామని సైకిల్ గుర్తుపై గెల్చిన టీడీపీ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. స్థానిక సత్యనారాయణపురంలోని రాజదర్బార్ హోటల్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్లకు నాయకత్వం వహిస్తున్న కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ లింగం ప్రసాద్ మాట్లాడుతూ గత 20ఏళ్ళుగా మున్సిపాలిటీ దోపిడీకి గురవుతోందని, పదవిని కాపాడుకునేందుకు టీడీపీలోకి వస్తున్న యలవర్తిని చేర్చుకోవద్దని పార్టీ అధిష్ఠానాన్ని కోరినా వినలేదన్నారు. గత నాలుగేళ్ళుగా మున్సిపాలిటీని కబళించేస్తున్నారని, ఈ విషయాన్ని కూడా అధిష్ఠానం ఎదుట మొత్తుకున్నా తమ మాటకు విలువివ్వలేదన్నారు. ముగ్గురు పిల్లల వ్యవహరాన్ని కోర్టు వరకు తీసుకెళ్ళానని, అధిష్ఠానం మాత్రం తనను వెనక్కి తగ్గేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అవినీతిపై విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయగా టీడీపీ పెద్దలు యలవర్తికే సహకరించారన్నారు. 2014నుండి రెండేళ్ళ పాటు కౌన్సిల్‌లో ప్రతిపక్షంలో ఉన్నా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో కలిసి కౌన్సిలర్లంతా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవారమన్నారు. యలవర్తి పార్టీలోకి వచ్చిన తర్వాత రావికి, టీడీపీ కౌన్సిలర్లకు మధ్య చిచ్చు పెట్టారన్నారు. గత 4నెలల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో పాటు జిల్లా మంత్రులు, ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలను కలిసి చివరి ఏడాది తనకు చైర్మన్ పదవి ఇప్పించాలని కోరి మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని వివరించానన్నారు. పట్టణస్థాయిలో టీడీపీలో అన్ని పదవులనూ యలవర్తి వర్గీయులకే కేటాయించారన్నారు. సైకిల్ గుర్తుపై గెల్చిన కౌన్సిలర్లకు పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోయిందన్నారు. మున్సిపల్ వైస్‌చైర్మన్‌పై అవిశ్వాసం తీర్మానానికి, చైర్మన్‌పై ఇచ్చిన తీర్మానానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. వైస్‌చైర్మన్‌పై ఇచ్చినా, ఇవ్వకపోయినా చైర్మన్‌పై అవిశ్వాసం ఇచ్చేవారమన్నారు. చైర్మన్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు సంతకాలు చేశారని, వారికి యలవర్తిపై విశ్వాసం లేదన్నారు. దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని, టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉన్న ఉయ్యూరు మున్సిపాలిటీలో జరిగిన అవిశ్వాసం వ్యవహారంలో ముగ్గురు వైసీపీ సభ్యులు సంతకాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే కొడాలి నానితో మిలాఖత్ అయ్యామని విమర్శిస్తే సహించేది లేదన్నారు. సైకిల్ గుర్తుపై గెల్చిన 16మంది కౌన్సిలర్లంతా ఏకమయ్యామని, ఇది టీడీపీ విజయమన్నారు. కౌన్సిలర్లను బుజ్జగించేందుకు వచ్చిన ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, బచ్చుల అర్జునుడులను కలవకపోవడం తప్పేనని, అయితే గత 4నెలలుగా కౌన్సిలర్ల ఆవేదనను అర్థం చేసుకోకపోవడాన్ని గుర్తించాలనే ఉద్ధేశంతోనే ఇలా చేశామన్నారు. తామంతా పుట్టినా, చచ్చినా టీడీపీలోనే ఉంటామని, మాజీ ఎమ్మెల్యే రావి, ముఖ్యమంత్రి చంద్రబాబు తమ నాయకులని అన్నారు. కౌన్సిలర్ మెరుగుమాల మేరీసంతోషం మాట్లాడుతూ టీడీపీ కౌన్సిలర్లు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటూ లింగం ప్రసాద్‌ను చైర్మన్ చేస్తామన్నారు. మరో కౌన్సిలర్ చింతల వరలక్ష్మి మాట్లాడుతూ ఈ వ్యవహారంలో పార్టీ అధిష్ఠానం హుందాగా వ్యవహరించాలని సూచించారు. టీడీపీ జిల్లా కార్యదర్శి తంగిరాల మోహన్‌దాస్ మాట్లాడుతూ యలవర్తి టీడీపీలో చేరిన తర్వాత సైకిల్ గుర్తుపై గెల్చిన కౌన్సిలర్లకు విలువ లేకుండా పోయిందని, మాజీ ఎమ్మెల్యే రావిని తప్పుదోవ పట్టించారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో కౌన్సిలర్లు బొడ్డు శివశ్రీ, పొట్లూరి కృష్ణారావు, అడుసుమిల్లి శ్రీనివాసరావు, లింగంశెట్టి నైనాజ్యోత్స్న, శొంఠి రామకృష్ణ, పసలాది ఏసుబాబు, యేల్చూరి వేణు, పెనుమూడి రమేష్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ మహ్మద్ అబూ, టీడీపీ నేత బొంబాయి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతోనే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ

*జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి స్పష్టీకరణ

హనుమాన్ జంక్షన్, జూలై 19: చెన్నై, కోల్‌కత్తా జాతీయ రహదారిపై హనుమాన్ జంక్షన్ కూడలి వద్ద తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్య నివారణకు అన్ని శాఖల సమన్వయం అవసరమని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అభిప్రాయపడ్డారు. హనుమాన్ జంక్షన్ కూడలిలో ట్రాఫిక్ రద్ధీని ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ రాష్ట్ర రాజధాని కావడంతో వాహనాల సంఖ్య పెరిగిందని అన్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల వలన విజయవాడకు వున్న ప్రాధాన్యత దృష్ట్యా జంక్షన్ కూడలి నుంచి వాహనాల మళ్ళింపు తప్పడం లేదన్నారు. ముందస్తుగా చర్యలు తీసుకోవడంలో కొన్ని శాఖలు విఫలంకావడంతోనే జంక్షన్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు ఎక్కువై ఇబ్బందులు పడుతున్నారని వాఖ్యానించారు. జిల్లా సరిహద్దులో ఉండడం కూడా జంక్షన్‌లో ట్రాఫిక్ రద్దీకి మరో కారణమని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు సహకరిస్తే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అంతకష్టం కాదన్నారు. స్థానిక నాయకులు చలసాని అంజనేయలు, వేగిరెడ్డి పాపారావులతో జిల్లా ఎస్పీ కొద్దిసేపు మాట్లాడారు.