కృష్ణ

సమర్థవంతంగా డిజిటల్ తరగతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్) : జిల్లాలో డిజిటల్ తరగతులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం స్థానిక డీఇఓ కార్యాలయ సమావేశ మందిరంలో గుడివాడ డివిజన్‌కు సంబంధించి డిజిటల్ తరగతుల ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా తరగతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఇఓ మాట్లాడుతూ డిజిటల్ తరగతుల నిర్వహణలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ముందుగా పెనమలూరులో వర్చువల్ స్టూడియో ద్వారా ప్రత్యక్ష ప్రసారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారానికి 25 గంటలు చొప్పున నెలకు 100 గంటలు ఖచ్చితంగా డిజిటల్ తరగతుల ద్వారా విద్యాబోధన జరగాలన్నారు. డిజిటల్ తరగతుల సామాగ్రి సమకూర్చడంలో సహకరిస్తున్న దాతలు, ప్రవాస భారతీయులను ఆమె అభినందించారు. రిసోర్స్ పర్సన్‌లు రాంబాబు, అమర్‌నాధ్ డిజిటల్ తరగతుల వినియోగాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో గుడివాడ, మచిలీపట్నం డీవైఇఓలు కమలకుమారి, బి సత్యనారాయణమూర్తి, ఐటీ సెల్ పర్యవేక్షకుడు పి వెంకటేశ్వరరావు, ఆర్‌ఎంఎస్‌ఎ డీసీఆర్ నోడల్ అధికారి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

పుష్కర ఘాట్ వద్ద యోగా తరగతులు
అవనిగడ్డ, జూలై 20: మన అవనిగడ్డ, పోలీసు శాఖ, న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో అవనిగడ్డ శివారు కొత్తపేట కృష్ణానది పుష్కరఘాట్ వద్ద ప్రశాంత వాతావరణంలో శుక్రవారం ఉదయం యోగా తరగతులు నిర్వహించారు. యోగా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుం దని స్పష్టం చేశారు. యోగా మాస్టర్ వేణు ఆధ్వర్యంలో ఈ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి పోతురాజు, సీఐ మూర్తి, పోలీసు అధికారులు, మన అవనిగడ్డ సభ్యులు, బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

విజయవంతంగా తొలిరోజు లారీల బంద్
మైలవరం, జూలై 20: ఇంధన ధరల పెంపుదలను నిరశిస్తూ దేశ వ్యాప్తంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నుండి నిర్వహించ తలపెట్టిన లారీల బంద్ తొలిరోజున మైలవరంలో విజయవంతం అయింది. స్థానిక బైపాస్ రోడ్‌లో లారీలను నిలిపివేసి మైలవరం ఏరియా అసోసియేషన్ తమ నిరసనను తెలియజేసింది. ప్రభుత్వం దిగి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని సంఘ అధ్యక్షులు ఓర్సు రామారావు, ప్రధానకార్యదర్శి జనార్థన్ సభ్యులు జమలయ్య తదితరులు డిమాండ్ చేశారు.