కృష్ణ

రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం కాపాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్): రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటూ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పట్టణంలో వసతి గృహ విద్యార్థులతో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కోనేరుసెంటరు నుండి బస్టాండ్ వరకు నిర్వహించిన ఈ కాగడాల ప్రదర్శనలో మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో పోరాడుతున్న టీడీపీ ఎంపీలకు ప్రతి ఒక్కరూ సంఘీభావంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, తెలుగు మహిళ పట్టణ అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ, కౌన్సిలర్ హేమ కుసుమ తదితరులు పాల్గొన్నారు.

కుంబ్లే పర్యటన విజయవంతం చేయాలి

మచిలీపట్నం, జూలై 20: ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు, భారతదేశ మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే బందరు పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు కోరారు. రూ.10కోట్లతో నిర్మించనున్న ఇండోర్ అండ్ ఔట్ డోర్ స్టేడియం నిర్మాణ శంకుస్థాపన, భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్, బందరు వాసి సికె నాయుడు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ నెల 24న కుంబ్లే మచిలీపట్నం రానున్నారు. కుంబ్లే పర్యటనను పురస్కరించుకుని శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విద్యా సంస్థల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, వ్యాయామోపాధ్యాయులు, విద్యా శాఖాధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చల్లపల్లి బైపాస్ రోడ్డులో స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, డీవైఇఓ సత్యనారాయణ మూర్తి, విద్యా సంస్థల ప్రతినిధులు కొమరగిరి చంద్రశేఖర్, సోమసుందరం తదితరులు పాల్గొన్నారు.

నారుమడులను ఛిద్రం చేస్తున్న ఎలుకలు

కూచిపూడి, జూలై 20: ఎలుకల బెడదతో వరి నారుమళ్లు పూర్తిగా దెబ్బతిన్న కాజ రైతులకు ప్రభుత్వం తక్షణమే ఎలుకల నివారణ మందులు, విత్తనాలు సరఫరా చేయాలని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులకు విజ్ఞప్తి చేశారు. మొవ్వ మండలం కాజ గ్రామంలో 4వేల ఆయకట్టు కలిగిన వ్యవసాయ భూముల్లో వరి సాగు చేసేందుకు పోసిన నారుమడులు ఎలుకల ధాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.1500లకు పైగా ఖర్చు చేసి పోసిన నారుమడులు రక్షించుకునేందుకు రైతులు సామూహికంగా చేసిన ప్రయత్నాలు కూడా విఫలమవటంతో దిక్కుతోచని వారు ఎలుకల నివారణకు బ్రోమోడయోలిన్ మందును అందచేయాలని మొవ్వ వ్యవసాయశాఖ అధికారులకు విన్నవించుకుంటే కోతల సమయానికి మాత్రమే ప్రభుత్వం ఈ మందును సరఫరా చేస్తుందని, అందువల్ల తమ దగ్గర స్టాకు లేదని తెలియపర్చటంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే రైతులకు ఎలుకల నివారణ మందులతో పాటు తిరిగి నారుమడులు పోసుకునేందుకు బీపీటీ విత్తనాలు సరఫరా చేయాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు.