కృష్ణ

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: అవిశ్వాస తీర్మానంతోనైనా మోదీ మనసు మార్చుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ వామపక్ష రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం మైలవరం బోసుబొమ్మ సెంటరులో ఒక రోజు నిరాహారదీక్ష నిర్వహించారు. సీపీఎం పట్టణ కార్యదర్శి ఎండి జాని అధ్యక్షతన జరిగిన ఈ దీక్షలో సీపీఐ జిల్లా ఇన్‌చార్జ్ కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ విభజన హామీలను, ప్రత్యేక హోదా అంశాన్ని తుంగలో తొక్కిన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను తీరని మోసం చేసిందన్నారు. నాలుగేళ్ళుగా మభ్యపెట్టి తాజాగా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మొండి చేయి చూపటం దుర్మార్గమన్నారు. తాజాగా ఎంపిలు పెట్టిన అవిశ్వాస తీర్మానం ద్వారా నైనా మోదీ తన మనసు మార్చుకుని ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పివి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కన్నారు. మోదీ మోసానికి రాష్ట్రం బలైందన్నారు. ప్రత్యేక హోదాతోపాటు వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వామపక్ష నేతల ఆధ్వర్యంలో బోసుబొమ్మ సెంటరులో రాస్తారోకో నిర్వహించి రహదారిని దిగ్భంధించారు. ఈ కార్యక్రమంలో మైలవరం, జి కొండూరు, రెడ్డిగూడెం మండలాలకు చెందిన సీపీఐ నేతలు గణేశ్వరమ్మ, గూడూరు శ్రీనివాసరెడ్డి, మట్టకొయ్య సుబ్బారావు, బుద్దారపు వెంకట్రావ్, సీపీఎం నేతలు రావూరి రామారావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ముల్లును ముల్లుతోనే తీస్తా

* వైసీపీ ఇన్‌చార్జి కేపీ

జి.కొండూరు, జూలై 20: ముల్లును ముల్లుతో తీయడానికే వైఎస్ జగన్ తనను మైలవరం నియోజకవర్గానికి పంపారని వైసీపీ ఇన్‌చార్జ్ వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. గుర్రాజుపాలెంలో సర్పంచ్ తమటం వెంకట్రామయ్య అధ్యక్షతన శుక్రవారం గ్రామపార్టీ సమావేశం జరిగింది. అనంతరం వెంకటాపురం, చెవుటూరు, కట్టుబడిపాలెం, కవులూరు గ్రామాల్లో వైసీపీ గ్రామశాఖ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తనపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. నందిగామలో గతంలో టెక్స్‌టైల్స్ పార్కు భూసమీకరణను తాను రైతుల పక్షాన నిలబడి భూసేకరణ నిలిపివేయించానన్నారు. తాను రైతులకు అండగా ఉండగా, మంత్రి ఉమ హడావిడి చేసి పబ్లిసిటీ కోసం తాపత్రయ పడ్డారన్నారు. ఈ విషయం అక్కడి స్థానిక రైతులందరికీ తెలుసన్నారు. గతంలో తాను టీడీపీలో ఉన్నప్పుడు అన్ని విషయాలను మంత్రి ఉమ సమర్ధించారన్నారు. కానీ నేడు ప్రతి విషయాన్ని ఆయన రాద్ధాంతం చేస్తున్నాడన్నారు. తనకు అక్క, బావ అని అర్ధరాత్రి ఇళ్ళకు వెళ్లి రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. 2014లో బొమ్మసాని పోటీ వల్ల వైసీపీ ఓట్లు చీలిన కారణంగా మంత్రి ఉమ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచాడన్నారు. ఇప్పుడు జోగికి మైలవరంలో టికెట్ ఇవ్వలేదని మాట్లాడుతూ బీసీలపై మంత్రి ఉమ కపట ప్రేమ చూపుతున్నాడన్నారు. ఇక్కడ వైసీపీ బలంగా ఉందన్నారు. సమన్వయంతో వైసీపీని మరింత బలోపేతం చేసి 2019 ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ పచ్చచొక్కాలకే పరిమితం చేశారన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తాననడం, అన్నక్యాంటీన్లు ప్రారంభించడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమన్నారు. అధికారం ఉందనే అహంభావంతో అందరినీ ఏకవచనంతో సంబోధించడం ఆయనకే చెల్లిందన్నారు. కానీ తాను ఇకపై అందరినీ బంధువులుగా భావించి ఆప్యాయంగా పిలుస్తానన్నారు. హత్యారాజకీయాలు, నేరసంస్కృతి ఎవరిదో ప్రజలకు తెలుసన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తిరుపతిరావు, జెడ్పీటిసి కాజ బ్రహ్మయ్య, కేడీసీసీబీ వైస్ చైర్మన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

చేపల్లో ఫార్మాలిన్ అవశేషాలు అపోహే
కైకలూరు, జూలై 20: ఇటీవల చేపల్లో ఫార్మాలిన్ అవశేషాలు ఉన్నట్టు వస్తున్న పుకార్లు అపోహ మాత్రమేనని గుడివాడ మత్స్య శాఖ ఎడీ శ్రీహరి అన్నారు. శుక్రవారం స్థానిక మత్స్య శాఖ కార్యాలయంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై, వనామి రొయ్యల సాగుపై ఆయన రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో వనామి రేట్లు పతనమవ్వడానికి గల కారణాలను వివరించారు. ఈ విషయంలో రైతులు, ఆక్వా షాపు యజమానులు తమ వంతు బాధ్యతగా ఆక్వా రంగం పురోగతికి సహకరించాలని కోరారు. మత్స్య రైతుల సంఘం అధ్యక్షుడు ముదునూరి సీతారామరాజు మాట్లాడుతూ ఒకప్పుడు రైతులను ఉన్నత స్థితికి తీసుకువెళ్లిన ఆక్వా రంగం నేడు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటోందన్నారు. చేపల్లో ఫార్మాలిన్ అవశేషాల అపోహల వల్ల మన రాష్ట్రానికి చెందిన చేపలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.