కృష్ణ

రోగుల ఆకలి తీర్చేందుకు ‘అన్న క్యాంటీన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రోగుల సౌకర్యార్ధం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా అన్న క్యాంటీన్ల ఏర్పాటు చేయనున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. అన్న క్యాంటీన్‌ల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని డీఆర్‌ఓ అంబేద్కర్ ఆస్పత్రి వర్గాలను ఆదేశించారు. ప్రతి పేద వాడి ఆకలి తీర్చాలన్న ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్‌లను ప్రారంభించారు. మచిలీపట్నం పరిసర ప్రాంతాల నుండి ప్రతి రోజూ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వందల సంఖ్యలో పేదలైన రోగులు వస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రిలో కూడా అన్న క్యాంటీన్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఆర్‌ఓ అంబేద్కర్ తెలియచేశారు. ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపటంతో పాటు వారం రోజుల్లో తాత్కాలిక అన్న క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల కాలంలో ఆస్పత్రిలో సరైన వైద్య సేవలు అందడం లేదన్న వస్తున్న ఆరోపణలపై డీఆర్‌ఓ తీవ్రంగా స్పందించారు. వైద్యులు, సిబ్బంది కొరతను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వైద్య సిబ్బంది నియామకానికి కృషి చేస్తానన్నారు. అత్యవసర కేసులను మాత్రమే విజయవాడకు రిఫర్ చేయాలని వైద్యులకు సూచించారు. మాతా శిశు విభాగంలో అదనంగా ఐదుగురు గైనకాలజిస్టులు, ఇద్దరు మత్తు డాక్టర్ల నియామకానికి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చినట్లు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ఎం జయకుమార్ తెలిపారు. ఆస్పత్రిలో నిఘాను పెంచేందుకు అదనంగా రెండు సీసీ కెమెరాలు, స్కానింగ్, బ్లడ్ బ్యాంక్ నందు రెండు ఎసీలు, సదరం క్యాంప్‌ల ద్వారా వికలాంగుల సర్ట్ఫికేట్ల జారీ నిమిత్తం ఐదు కంప్యూటర్లు, ప్రింటర్, స్కానర్, ఇంటర్ నెట్ ఏర్పాటు, ఓపి విభాగం నందు మరుగుదొడ్ల మరమ్మతులు తదితర అవసరాల నిమిత్తం ఆస్పత్రి అభివృద్ధి నిదులు ఖర్చు చేసేందుకు కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ తలారి సోమశేఖర్, డైరెక్టర్లు అంగర తులసీదాస్, అబ్దుల్ అజీమ్, బివి కృష్ణంరాజు, డి ఉమామహేశ్వరరావు, ఆర్‌ఎంఓ డా. అల్లాడ శ్రీనివాసరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ కె రామలక్ష్మి పాల్గొన్నారు.

‘ఖరీఫ్’ ఆశాజనకం

* ముమ్మరంగా వ్యవసాయ పనులు

మచిలీపట్నం, జూలై 12: ముందస్తు సాగునీటి విడుదల, పుష్కలంగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా సాగుతోంది. ఓ పక్క కురుస్తున్న భారీ వర్షాలు మరో పక్క కాలువల్లో పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలతో రైతాంగం ఖరీఫ్ సాగును మరింత ముమ్మరం చేశారు. ముందస్తుగా నీటి విడుదలతో గత నెలలో వరి నారు పోసిన రైతాంగం నేడు నాట్ల ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే 50 శాతం మేర వరి నాట్లు పూర్తయ్యాయి. మరో 50 శాతం మేర వరి నాట్లను మరో వారం పది రోజుల్లో పూర్తి చేయనున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున వ్యవసాయ పనులు జరుగుతుండగా కూలీల డిమాండ్ కూడా అదే విధంగా ఏర్పడుతోంది. వరి నాట్లు వేసేందుకు భారీగా కూలీ డిమాండ్ చేస్తున్నారు. కూలీల డిమాండ్‌ను అధిగమించేందుకు అధిక శాతం మంది రైతులు వెద పద్ధతిన సాగు చేస్తున్నారు. 2.40లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా ఇప్పటికే 60వేల 345 హెక్టార్లలో సాగు పూర్తయింది. 39వేల 83 హెక్టార్లలో వెద పద్ధతిన సాగు చేపట్టారు. గత ఏడాది 18వేల 970 హెక్టార్ల మాత్రమే వెద పద్ధతిన సాగు చేపట్టడం విశేషం. ఈ సంవత్సరం అందుకు రెట్టింపు సాగు చేశారు. వెద పద్ధతి వల్ల వ్యవసాయ ఖర్చులు గణనీయంగా తగ్గుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా వ్యవసాయ శాఖ అవసరం మేర వరి విత్తనాలు, ఎరువులను పంపిణీ చేస్తోంది. 7వేల 500 క్వింటాళ్ల వరి విత్తనాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 90 శాతం మేర పంపిణీ జరిగినట్లు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ టి మోహనరావు తెలిపారు. గత ఏడాది కూడా శివారు ప్రాంతాలకు సాగునీరు పుష్కలంగా అందిన దాఖలాలు లేవు. ముందస్తుగా విడుదల చేసిన సాగునీటితో గత ఏడాది శివారు ప్రాంత రైతులు సాగు చేపట్టినా ఆ తర్వాత నీటి విడుదలలో కొంత జాప్యం ఏర్పడటంతో తీవ్రంగా నష్టపోవల్సి వచ్చింది. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన శివారు ప్రాంత రైతుల్లో వ్యక్తమవుతోంది.