కృష్ణ

యుద్ధప్రాతిపదికన రిజర్వాయర్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు) : పట్టణ ప్రజల మంచినీటి సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో యుద్ధప్రాతిపదికన మంచినీటి రిజర్వాయర్లను నిర్మిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్ అన్నారు. స్థానిక చిలకలపూడిలోని 500 కెఎల్ రిజర్వాయర్ పనులను చైర్మన్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజల మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నాలుగు సంవత్సరాలలో ఎనిమిది రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రిజర్వాయర్ల నిర్మాణం వల్ల మారుమూల ప్రాంతాలకు మంచినీరు పుష్కలంగా రెండు పూటలా అందుతుందన్నారు. గడ్డిబజారు, మందులగూడెం, సర్కారుతోట, గంగులతోట, రుస్తుంబాద, భాస్కరపురం, గిలకలదిండి, చిలకలపూడిలో రిజర్వాయర్లు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాధం, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

బందరు కాలువకు పూర్తి స్థాయిలో నీరిస్తాం

పమిడిముక్కల, జూలై 22: బందరు కాలువలో కర్రనాచు, గుర్రపుడెక్క కారణంగా సాగునీటి ప్రవాహానికి ఆటంకం కలిగిందని, త్వరలో వాటిని తొలగించి బందరు కాలువకు పూర్తి స్థాయి నీటిని పంపిణీ చేస్తామని జల వనరుల శాఖ రాష్ట్ర ఎఫెక్ట్స్ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణ అన్నారు. ఆదివారం తూర్పు కృష్ణా ప్రాజెక్టు చైర్మన్ జి శివరామకృష్ణతో కలిసి వీరంకిలాకుల వద్ద బందరు కాలువ నీటి మట్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గుర్రపు డెక్క తొలగించి మేడూరు కాలువ, భీమనది కాలువలకు పూర్తి స్థాయిలో నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఇ రాజ్‌కుమార్, నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు మైనేని వెంకట నరేంద్ర, నాదెళ్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.