కృష్ణ

గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు: గ్రామీణ క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని శాప్ చైర్మన్ డాక్టర్ పి అంకమ్మ చౌదరి అన్నారు. గుడ్లవల్లేరులో ఎస్‌ఇఆర్ హైస్కూల్ క్రీడా మైదానంలో గత మూడు రోజులుగా కొసరాజు వెంకటాద్రి చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాంట్మింటన్ పోటీలను నిర్వహిస్తోంది. 13 జిల్లాల నుండి వచ్చిన జట్లు మూడు రోజులుగా హోరాహోరీగా బాల్ బ్యాట్మింటన్ పోటీల్లో పాల్గొన్నాయ. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన బహుమతులు ప్రదానోత్సవ కార్యక్రమంలో అంకమ్మ చౌదరి మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.300 కోట్లను కేటాయించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ.40 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియం నుంచి సింధూ, కరణం మల్లేశ్వరం వంటి క్రీడాకారులు వెళ్లారని, మన రాష్ట్రం నుంచి అలాంటి క్రీడాకారులను వెలికి తీయాలని ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు. బాలికల కేటగిరిలో విశాఖపట్నం జట్టుకు రూ.2,500, గుంటూరు జట్టుకు రూ.5వేలు, తూర్పుగోదావరి జట్టుకు రూ.7,500, కృష్ణా జిల్లా జట్టుకు రూ.10వేలు, బాలుర విభాగంలో విశాఖపట్నం జట్టుకు రూ.2,500, తూర్పుగోదావరి జట్టుకు రూ.5వేలు, కర్నూలుకు రూ.7వేలు, పశ్చిమగోదావరి జట్టుకు రూ.10వేలు నగదు, మెమొంటోలను ట్రస్ట్ అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి, అంకమ్మ చౌదరి చేతులు మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి వల్లభనేని వెంకట్రావ్, గ్రామ సర్పంచ్ వల్లభనేని వెంకట సుబ్బారావు, పీఎసీఎస్ అధ్యక్షుడు పి రవికుమార్, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి రవీంద్రబాబు, వైస్ ప్రిన్సిపాల్ బి కరుణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

మైలవరం, జూలై 22: గ్రామాలలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే వౌలిక సదుపాయాలు కల్పించామని, అన్ని గ్రామాలలో అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా మార్చాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రజాప్రతినిధులను ఆదేశించారు. మైలవరం పట్టణంలోని 2వ వార్డులో నిర్మిస్తున్న సీసీ రోడ్డును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా మైలవరంలో అన్ని రోడ్లను సీసీ రోడ్లుగా మార్చాలని ఆయన ప్రజాప్రతినిధులకు సూచించారు. 2వ వార్డులోని మైక్ బాబూరావు ఇంటి వద్ద నుండి ట్రాక్టర్ షెడ్ మీరా ఇంటి వరకూ 280 మీటర్ల పొడవు, ఐదున్నర మీటర్ల వెడల్పు గల ఈ రహదారిని సీసీ రోడ్డుగా మార్చటానికి ఎన్నార్‌ఈజిఎస్ నిధులు, ప్రత్యేక అభివృద్ధి నిధులు వెరశి 20 లక్షల రూపాయల వ్యయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రహదారికి రెండు వైపులా డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టాలని, అంతేగాక సుందరంగా ఉండే విధంగా రోడ్డుకిరువైపులా మొక్కలు నాటి గ్రీనరీగా తయారు చేయాలని కాంట్రాక్టర్ లీలాప్రసాద్‌కు ఆయన సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు శోభన్‌బాబు, గంజి కృష్ణారెడ్డి, మైక్ బాబూరావు తదితరులు పాల్గొన్నారు.