కృష్ణ

నిఘా నీడలో ‘కృష్ణా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 22: జిల్లా పోలీసు యంత్రాంగం సాంకేతికతను అంది పుచ్చుకుంటోంది. నేర నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. నేర నియంత్రణ, నేరస్థుల గుర్తింపు సీసీ కెమెరాల ప్రాధాన్యతను గుర్తించిన పోలీసు యంత్రాంగం ఆ దిశగా జిల్లా అంతటా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆధునాతన సీసీ కెమెరాల ఏర్పాటుతో నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలతో పాటు నిత్యం రద్దీగా ఉండే కూడళ్లల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా అపరచిత వ్యక్తుల సంచారాన్ని గుర్తించటంతో పాటు ఎవరు ఎటువంటి నేరాలకు పాల్పడినా ఈ సీసీ కెమెరాల కన్ను కప్పి తప్పించుకునే పరిస్థితులు ఉండవు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పరిధిలో 49 పోలీసు స్టేషన్లుగా ఉండగా ఇప్పటి వరకు 1800 పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటినీ రియల్ టైమ్ గవర్నెన్స్‌కు అనుసంధానం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ (మెజర్స్) ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్ట్ 2013-14 ప్రకారం అత్యంత జన సంచారం ఉన్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 100 అంతకంటే ఎక్కువ మంది గుమిగూడే హోటళ్లు, మార్కెట్లు, షాపులు, విద్యా సంస్థలు, ఆలయాలు, హాస్పటల్స్, క్రీడా ప్రాంగణాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో నిర్వాహకులచే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తున్నారు. దొంగతనాలు, దోపిడీలు తదితర నేరాలకు పాల్పడే నేరస్థులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. సీసీ ఫుటేజీల ఆధారంగా ఇటీవలి కాలంలో నేరస్తులను గుర్తించి కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జిల్లాకు వచ్చిన యేడాది కాలంలో సాంకేతికతకే అగ్రతాంబూలం ఇచ్చారు. ఇటీవల గుడివాడలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసుతో పాటు అనేక ముఖ్య కేసులను సాంకేతిక పరిజ్ఞానంతోనే ఛేధించగలిగారు.

కుంబ్లే పర్యటన విజయవంతం చేయాలి

* మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, జూలై 22: మచిలీపట్నంలో రూ.13 కోట్లతో నిర్మించనున్న అథ్లెటిక్ స్టేడియం శంకుస్థాపన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న శంకుస్థాపన కార్యక్రమానికి అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు పద్మశ్రీ అనిల్ కుంబ్లే ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలిపారు. శంకుస్థాపన మహోత్సవ ఏర్పాట్లపై ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులు, విద్యా సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ 24వ తేదీ ఉదయం 9గంటలకు మూడు స్థంభాల సెంటరు వద్ద అనిల్ కుంబ్లేకు ఘన స్వాగతం పలకటంతో పాటు పట్టణ పుర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. గో సంఘం వద్ద 13 ఎకరాల్లో నిర్మించనున్న స్టేడియంకు శంకుస్థాపన, జిల్లా పరిషత్ సెంటరులో ఏర్పాటు చేసిన సికె నాయుడు విగ్రహావిష్కరణలో కూంబ్లే పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యేలా చూడాలన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఉద్యోగాల్లో క్రీడా కోటా, రిజర్వేషన్లు పటిష్ఠంగా అమలు చేస్తామన్నారు. పీఇటీ పోస్టుల భర్తీతో పాటు స్పోర్ట్స్ హాస్టల్ నిర్మాణానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో క్రీడా క్యాలెండర్ తయారు చేసి జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు బందరులో నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ మహబూబ్ బాషా, మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.