కృష్ణ

శాకాంబరిగా శ్రీకొండలమ్మ తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు: విలంభినామ సంవత్సర ఆషాఢమాసం సందర్భంగా ఆదివారం మండల పరిధిలోని వేమవరంలో వేంచేసియున్న శ్రీ కొండలమ్మ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో శాకాంబరి దేవిగా కన్నుల పండువగా అలంకరించారు. అమ్మవారికి మహిళలు కుంకుమార్చనలు నిర్వహించారు. ఆదివారం సెలవుదినం కావటంతో రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేశారు. ఉదయం నుండే భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. తొలుత గర్బాలయంలోని అమ్మవారిని దర్శించుకుని, అనంతరం అలివేటి మండపంలోని శాకాంబరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జివిడిఎన్ లీలాకుమార్, ఆలయ చైర్మన్ బెల్లంకొండ ఏడుకొండలు, ట్రస్ట్ సభ్యులు కానూరి సత్యనారాయణప్రసాద్, మనె్నం సత్యనారాయణ, మాదాసు శివరామకృష్ణప్రసాద్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.