కృష్ణ

అక్రమాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట: తెలుగుదేశం ఎమ్మెల్యేల అక్రమాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో వేధిస్తారా అంటూ వైకాపా విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను ప్రశ్నించారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గుంటూ రు జిల్లా పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ వందల కోట్ల అవినీతికి పాల్పడుతున్న వారిని వదిలివేసి నిజ నిర్ధారణకు వెళుతున్న వైకాపా నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సామినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం ఉందా ఆటవిక పాలన ఉందా అర్ధం కావడం లేదని, వైకాపా నేతలు సంఘటన స్థలానికి వెళితే ఎక్కడ నిజాలు బయట పడతాయేమోనని అక్రమ అరెస్టులకు పాల్పడిందన్నారు. నిజ నిర్ధారణ కమిటీ పర్యటనను అడ్డుకొని వాయిదా వేయగలిగారని, తెదేపా నేతల అవినీతిని బట్టబయలు చేసే ఉద్యమాన్ని ఆపలేరని, అక్రమ మైనింగ్ కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని సామినేని డిమాండ్ చేశారు.

బాంకాక్‌లో బందరు యువకుడు మృతి

మచిలీపట్నం, ఆగస్టు 14: ఆరేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తూ వారం రోజుల క్రితం సంస్థలో పని చేస్తున్న వారందరితో బాంకాక్ ట్రిప్‌కు వెళ్లిన ఓ యువకుడు మంగళవారం శవమై వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక గొడుగుపేటకు చెందిన పల్లంపాటి ప్రసాద్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడైన వెంకటేష్ (30) గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో క్రెడిట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సంస్థ తరఫున బాంకాక్ ట్రిప్‌కు వెళ్లాడు. ట్రిప్‌లో ఉన్న వెంకటేష్ 10వ తేదీ రాత్రి బాంకాక్‌లో స్టే చేసిన ప్రైవేట్ హోటల్‌లోని స్విమ్మింగ్ ఫూల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వెంకటేష్ మృతి చెందాడని 11వ తేదీన మచిలీపట్నంలోని తల్లిదండ్రులకు సమాచారం అందగా మంగళవారం ఉదయం మృతదేహాన్ని గొడుగుపేటలోని స్వగృహానికి తీసుకువచ్చారు. కుమారుడు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరై విలపించారు.