కృష్ణ

శివారు భూములకూ సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు: జిల్లాలోని శివారు భూములకు సైతం సాగునీరు అందిస్తామని ఇరిగేషన్ ఎస్‌ఇ కెవిఎన్‌ఎల్‌పి చౌదరి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక పుల్లేటి కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఇ మాట్లాడుతూ జిల్లాలోని ప్రకాశం బ్యారేజి కింద 7లక్షల ఎకరాలు సాగవుతున్నాయన్నారు. రైతులకు సాగుకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సాగునీరు అందిస్తున్నామన్నారు. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు ఆయకట్టు ఎక్కడా దెబ్బతినకుండా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 90శాతం నాట్లు పూర్తయినప్పటికీ బంటుమిల్లి మండలంలో మాత్రం ఆకుమడులు అందుబాటులో లేక నాట్లు పూర్తి కాలేదన్నారు. బంటుమిల్లి మండలంలో 10వేల ఎకరాల్లో నాట్లు వేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని 40 వేల ఎకరాల్లో నాట్లు పూర్తి కావాల్సి ఉందన్నారు. జూన్ 20వ తేదీ నుంచి ప్రకాశం బ్యారేజీకి 40 టీఎంసీల నీరు చేరిందన్నారు. ఆయన వెంట డీఇ సూర్యభరత్, ఎడబ్ల్యు సిద్దార్ధ, లాట్ సూపరింటెండెంటు ఎం వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.