కృష్ణ

కన్వర్జన్సీ నిధులతో గ్రావెల్, బీటీ రోడ్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి: ఉపాధి హామీ పథకం కన్వర్జన్సీ నిధులతో గ్రావెల్, బీటీ లింక్ రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తున్నట్లు ఎన్‌ఆర్‌ఇజీఎస్ డెప్యూటీ కమిషనర్ వి ఉషారాణి తెలిపారు. శుక్రవారం చల్లపల్లి వచ్చిన ఆమె ఉపాధి హామీ పథకం కన్వర్జన్సీ నిధులతో నిర్మించిన పలు అభివృద్ది పనులను పరిశీలించారు. సంపద తయారీ కేంద్రం, అంగన్‌వాడీ, కమ్యూనిస్టు బజార్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజి సిస్టమ్‌తో నిర్మించిన సీసీ రోడ్డును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై ఉపాధి హామీ పనుల వివరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ 11 శాఖలతో కలిపి అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామన్నారు. విలేజ్ పార్క్, గ్రామీణ సంతలు, శ్మశానవాటికల అభివృద్ధి, ఇంకుడు గుంటల తవ్వకం, క్రీడా మైదానాల అభివృద్ధి, ఫామ్‌ఫాండ్స్, సంపద తయారీ కేంద్రాల నిర్మాణాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. పచ్చదనాన్ని పెంచేందుకు ఇనిస్టిట్యూట్ ప్లాంటేషన్, మత్స్యశాఖ అభివృద్ధిలో భాగంగా అప్రోచ్ రోడ్ల నిర్మాణం, గోకులం మెగా పశుగ్రాస క్షేత్రాలు తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పీఆర్ ఎఇ రామకృష్ణ, ఏపీఎం రామ్మోహనరావులతో పనులపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఎంపీపీ యార్లగడ్డ సోమశేఖరప్రసాద్, జెడ్పీటీసీ కృష్ణకుమారి, ఎంఇఓ వి మురళీకృష్ణ పాల్గొన్నారు.

విలేజ్ విజిట్‌తో శాంతిభద్రతల పరిరక్షణ

*జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ త్రిపాఠి

చల్లపల్లి, ఆగస్టు 17: ప్రజలకు దగ్గరై గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పోలీసు స్టేషన్ వరకు రాకుండా అక్కడికక్కడే పరిష్కరించేందుకు విలేజ్ విజిట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పోలీసు స్టేషన్‌ను సందర్శించిన ఆయన పలు రికార్డులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ నిజాయితీగా చట్టపరంగా ప్రజలకు సేవలందించటమే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం పని చేస్తుందన్నారు. భార్య, భర్తల సమస్యలు, దారి తగాదాలు, చిన్నచిన్న సమస్యలను ఎఫ్‌ఐఆర్ వరకు వెళ్లకుండా పరిష్కరించేందుకు విలేజ్ విజిట్‌లో అవకాశం ఉంటుందన్నారు. ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్‌తో కేసు తీవ్రత అందరికీ తెలుస్తుందని, సీసీ కెమెరాలు ద్వారా కేసు దర్యాప్తుకు, సాక్ష్యాలు సేకరించేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో క్రైం రేటు గణనీయంగా తగ్గిందన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించటంపై దృష్టి సారించామన్నారు. ప్రతి కేసును రిజిస్టర్ చేస్తున్నామన్నారు. ఘంటసాల బౌద్ధ క్షేత్రాన్ని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సందర్శించి మ్యూజియంలో ఉన్న అన్ని శిల్పాల వివరాలు తెలుసుకుని బౌద్ధ స్థూపం చుట్టూ ప్రదక్షణలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వి పోతురాజు, చల్లపల్లి సీఐ జనార్ధన్, ఎస్‌ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.