కృష్ణ

రోగుల సేవలో పునీతం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేసే వైద్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అధికారి బిఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన డీఆర్‌ఓ అంబేద్కర్ ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆస్పత్రి అభివృద్ధికి తీసుకోవల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో వైద్య సేవలపై రోగుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని, మరోసారి ఫిర్యాదులు అందితే సహించేది లేదన్నారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో అవసరమైన సెలైన్ స్టాండ్‌లు, డ్రగ్స్, సర్జికల్ ల్యాబ్ ఐటమ్స్, దోబి ఐటమ్స్, స్టేషనరి తదితర పరికరాలు నిబంధనలు పాటిస్తూ కొటేషన్లు తీసుకుని కొనుగోలు చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఆస్పత్రి ఆవరణలో వర్షపు నీరు నిల్వ లేకుండా ఉండేలా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడానికి ప్రతిపాదనలు పంపాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. జయకుమార్‌ను ఆదేశించారు. ఆస్పత్రిలో ఉన్న 450 బెడ్స్‌పై వారానికి కనీసం రెండు సార్లు బెడ్‌షీట్స్ మార్చేందుకు ప్రస్తుతం ఉన్న వెయ్యి బెడ్‌షీట్స్‌కు అదనంగా మరో 500 బెడ్‌షీట్స్ కొనుగోలుకు సమావేశం ఆమోదం తెలిపింది. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను ఖచ్చితంగా అమలు చేయాలని, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని డీఆర్‌ఓ అంబేద్కర్ ఆదేశించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు సక్రమంగా వైద్యం అందకపోవటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గైనిక్ వార్డులో వైద్యుల కొరత, పని భారం దృష్టిలో ఉంచుకుని శనివారం నుండి అదనపు గైనికాలజిస్ట్‌ను ఏర్పాటు చేయాలని డీఆర్‌ఓ ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుండి డిప్యుటేషన్‌పై గైనికాలజిస్ట్‌ను నియమించేందుకు డీసీహెచ్‌ఎస్ డా. కె జ్యోతిర్మణి చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రి ఆవరణలో జనరిక్ మెడికల్ షాపు సరిగ్గా తెరవకపోవటం వల్ల రోగుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని సక్రమంగా పని చేసేలా చూడాలని డీఆర్‌ఓ అంబేద్కర్ ఫోన్‌లో డీఆర్‌డీఎ పీడీ చంద్రశేఖరరాజును ఆదేశించారు. ఓపి రోగులు, ఇన్‌పేషెంట్లు, వారి సహాయకుల సౌకర్యార్ధం అన్న క్యాంటీన్ ఏర్పాటు విషయంలో ఇప్పటికే ఉన్నతాధికారులతో మాట్లాడామని, ఆస్పత్రి సమీపంలో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ తలారి సోమశేఖర్ మాట్లాడుతూ ఆస్పత్రి ఆవరణలో గ్రీనరీ ఏర్పాటు చేయాలని, వివిధ వైద్య విభాగాల్లో ఏసీలు, ఫ్యాన్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. ఎం పద్మజారాణి, కమిటీ సభ్యులు అబ్దుల్ అజీమ్, అంగర తులసీదాస్, ఆర్‌ఎంఓ డా. అల్లాడ శ్రీనివాసరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ కె రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.