కృష్ణ

మైలవరంలోనే ఉంటా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: తాను స్థానికేతరుడినని, ఇక్కడ నివాసం ఉండనని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, త్వరలోనే ఇక్కడ నివాసం ఉండి వారి నోళ్ళు మూయిస్తానని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణ ప్రసాద్(కేపీ) స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి మైలవరంలో ఇల్లు నిర్మించుకోడానికి స్థల పరిశీలన జరిపారు. అతి కొద్ది రోజులలో యుద్ధ ప్రాతిపదికన పార్టీ కార్యాలయంతోపాటు తాను నివాసం ఉండేందుకు వీలుగా భవన నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. అందరికీ అందుబాటులో ఉండటంతోపటు పార్టీ కార్యకర్తలకు, నేతలకు, ప్రజలకు పార్టీ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అప్పుడు తనపై దుష్ప్రచారం చేస్తున్న వారికి తగురీతిలో సమాధానం చెబుతానన్నారు. అనంతరం ఇటీవల మరణించిన పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పామర్తి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ జొన్నలగడ్డ గంగాధరరావు, ఏఎంసి మాజీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.