కృష్ణ

ఉన్నదీ ఊడుతుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: వైసీపీ అధినేత, వాకింగ్ వీరుడు వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యవహారం చూస్తుంటే ఆయన సీఎం కుర్చీ తప్ప మరెక్కడా కూర్చోరన్నట్టు కనిపిస్తోందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ విలేఖరితో ఆయన మాట్లాడుతూ అసలు ఎన్నికల్లో పోటీ చేసి ఎందుకు గెలిచినట్టో కూడా అర్థం కావడం లేదని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు అసెంబ్లీలో ‘ప్రతిపక్ష నేత’ హోదా కట్టబెడితే ‘నాకిది సరికాదని’, ‘సీఎం కుర్చీయే కావలని’ అసెంబ్లీకి రావడం మానేసారని అన్నారు. ఇచ్చిన దానితో సంతృప్తి చెందకపోతే ‘ఉన్నదీ పోతుందన్న’ విషయం మర్చిపోకూడదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ‘అసెంబ్లీని వేదిక’గా చేసుకోవాల్సిన ఆయన ‘వాకింగ్’ పేరుతో కాలం గడిపేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోందని విమర్శించారు. ‘అసెంబ్లీపై అలగడం’ ఏమిటో అర్థం కావడం లేదని, ఆయన వ్యవహారం చూస్తుంటే ‘చెరువుపై అలిగితే’ ఏమవుతుందో ప్రత్యేకంగా ఏమీ చెప్పనవసరం లేదని పేర్కొన్నారు. అసలు ఆయన లక్ష్యం ఏమిటో కూడా తెలియడం లేదని, చట్టసభలో ‘ప్రతిపక్షం పాత్ర’ సైతం మరచిపోయి ‘ఆయా రాం... గయా రాం’ అన్నట్టు ఉందని మంత్రి ఉమ స్పష్టం చేశారు. ఆయనను నమ్ముకున్న ‘పరివారం’ పరిస్థితి ‘అగమ్యగోచరం’గా ఉందని, వారి ‘అధినేత’ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుని ఎవరి కొంప ముంచుతాతో వారికే ‘అంతుపట్టడం’ లేదని అన్నారు. ఎవరికి వారు ‘గమ్మునవుండి’ ‘చోద్యం’ చూస్తున్నారని అన్నారు. కేసుల నుండి బయటపడడానికి కేంద్రం వద్ద ‘మోకరిల్లిన’ ఆ ‘మడమ తిప్పని’ నాయకుడు ఎంపీలతో ‘రాజీనామా’ చేయించి ‘సమస్య నుండి పలాయనం’ పాటించారని మంత్రి ఉమ వ్యంగ్యంగా అన్నారు. కేంద్రం నిధులు ‘విదల్చకపోయినా’ వారిని ‘పల్లెత్తుమాట’ అనరని, ఇక్కడ ప్రగతికి అడ్డం పడుతూ విమర్శలు గుప్పిస్తుంటారని స్పష్టం చేశారు. కేంద్రంపై నోరుమెదపని ఆయన బీజేపీతో ‘కుమ్మక్కు ’ కాక మరేమిటని అన్నారు. కేంద్రంతో కుమ్మక్కయ్యారనడానికి ఇంతకన్నా నిదర్శనమేంటని ఉమ ప్రశ్నించారు. ‘రేకలు ఊడిన కమలం’తో జత కట్టిన ‘రెక్కలూడిన ఫ్యాన్’ జాతకం త్వరలోనే ‘ప్రజా రణక్షేత్రం’లో బట్టబయలు కాకతప్పదని స్పష్టం చేశారు. సీఎం కుర్చీ కోసం పాకులాడితే సరిపోదని, ‘ప్రజాసేవ’తోనే కుర్చీ దక్కుతుందన్న విషయం గమనించాలని మంత్రి ఉమ హితవు పలికారు. పనికిమాలిన విమర్శలు మాని ప్రగతికి సహకరించకపోయినా అడ్డం పడకుండా ఉంటే చాలని ఆయన స్పష్టం చేశారు.