కృష్ణ

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు: విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం కావాలని కైకలూరు సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు ఎం అనూరాధ, సత్యకుమారి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారు చట్టాల పట్ల అవగాహన కల్పించారు. గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఐదుగురు ఉపాధ్యాయులను హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చైర్మన్ గురజాడ ఉదయ శంకర్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వడ్లాని శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.