కృష్ణ

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు) సెప్టెంబర్ 14: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రూ.20 లక్షలతో నిర్మించనున్న రోగుల సహాయకుల విశ్రాంతి భవనానికి మంత్రి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు చిరంజీవి మంజూరు చేసిన నిధులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. గతంలో నిర్మించిన విశ్రాంతి భవనంలో ఉచిత డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఇది అవసరమైనందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో వౌలిక సదుపాయాల అభివృద్ధికి వైద్య సౌకర్యాలు మెరుగుపర్చుటకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ప్రత్యేకంగా ప్రమాద కేసులకు సంబంధించి 20 బెడ్‌లు అదనంగా ఏర్పాటు చేయుటకు అనుమతులు కోరినట్లు మంత్రి తెలిపారు. నర్సింగ్ కళాశాలకు సొంత భవనం నిర్మించుటకు రూ.25కోట్లు, ఆయుష్ ఆస్పత్రి నిర్మాణానికి రూ.25లక్షలు నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. అనుమతులు రాగానే నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ రోగుల అవసరాలను గుర్తించి విశ్రాంతి భవనం నిర్మించటం పేదల ప్రభుత్వం అనడానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ తలారి సోమశేఖర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. జయకుమార్, ఆర్‌ఎంఓ డా. అల్లాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వారెంట్ రాజకీయ కక్షే

పెడన, సెప్టెంబర్ 14: రాజకీయ కక్షలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు విమర్శించారు. శుక్రవారం స్థానిక విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ సమితిలో ప్రసంగించేందుకు చంద్రబాబుకు ఆహ్వానం రావడం మోదీకి ఇష్టం లేదన్నారు. దీంతో ఆయన చంద్రబాబుపై కక్ష పెట్టుకున్నారన్నారు. ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి అమెరికాకు వెళ్లాల్సి ఉందని, ఈ లోగా 21న కోర్టుకు హాజరయ్యే విధంగా నోటీసులు పంపించారని వేణుగోపాలరావు తెలిపారు. ప్రజాకోర్టులో మోదీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

చోరీ కేసులో మాజీ వైస్ ప్రిన్సిపాల్ అరెస్ట్

నూజివీడు, సెప్టెంబర్ 14: స్థానిక ఎంప్లారుూస్ కాలనీలో మహిళను బెదిరించి, మహిళ మెడలో గొలుసు అపహరించుకుపోయిన నిందితుడ్ని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం స్థానిక పట్టణ పోలీసుస్టేషన్‌లో డీఎస్‌పీ ప్రసాదరావు విలేఖరులతో మాట్లాడుతూ నూజివీడు పట్టణానికి చెందిన పసుపులేటి రమేష్‌బాబు గతంలో ఒక విద్యాసంస్థలో వైస్‌ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. అనంతరం సెక్యూరిటీగార్డుగా విధులు నిర్వహించాడు. బాగా ఆర్థిక ఇబ్బందులలో ఉండి, వీటిని అధిగమించేందుకు చోరీలే మార్గంగా ఎన్నుకున్నాడు. దీనిలో భాగంగా ఎంప్లారుూస్ కాలనీలో ప్రమీలాదేవీ ఒంటరిగా ఉండటాన్ని గమనించి, పురపాలక సంఘం ఉద్యోగిగా పరిచయం చేసుకుని, ఇంటిలో ఉన్న ఒక గదిని అద్దెకు ఇవ్వమని కోరాడు. గది చూపిస్తున్న సమయంలో ఆమెను బలవంతంగా కట్టివేసి, ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించుకుని పారిపోయాడు. పట్టణ ఎస్‌ఐ సీహెచ్ రంజిత్‌కుమార్ ఆధ్వర్యంలో సీసీ ఫుటేజీలు పరిశీలించి, చోరీ జరిగిన అయిదు గంటల్లోనే నిందితుడ్ని అరెస్టు చేశారు. నిందితుడ్ని అరెస్టు చేసిన పట్టణ ఎస్‌ఐ రంజిత్‌కుమార్‌ను డీఎస్పీ అభినందించారు.