కృష్ణ

ఆధ్వాన్నంగా పారిశుద్ధ్యం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, సెప్టెంబర్ 21: మైలవరంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారైంది. పర్యవసానంగా ప్రజలు అంటురోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. స్థానిక ఎస్వీఎస్ నగర్‌లో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. అధ్వాన్నమైన రోడ్లు, డ్రైన్లు, మురికి కూపాలుగా మారాయి. వాటిలో పందులు స్వైర విహారం చేస్తూ మరింత అధ్వాన్నంగా తయారు చేస్తున్నాయ. ఫలితంగా దోమలు స్వైర విహారం చేస్తూ విజృంభిస్తున్నాయి. మురుకికూపాలు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా విరాజిల్లుతూ హడలెత్తిస్తు న్నాయ. పర్యవసానంగా ప్రజలకు అంటు రోగాల బారినపడి అల్లాడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి ప్రాణాంతకమైన రోగాలతో ప్రజలు ఆసుపత్రులలో చికిత్సలు పొందుతున్నారు. కొన్ని చోట్ల మురికి నీరు డ్రైన్లలో ముందుకు సాగక అక్కడే నిల్వ ఉండి అందులోనే పందులు పొర్లాడి దుర్ఘంధం వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. డ్రైన్లలో తీసిన చెత్త ఒడ్డున వేసి మరింత కంపుకు కారణమవుతున్నారు. తీసిన చెత్తాచెదా రాన్ని ఎప్పటికప్పుడు తరలిస్తే దుర్గంధం బారి నుండి రక్షించిన వారవుతారని పలువురు చెబుతు న్నారు. దీనికి తోడు ఖాళీ ప్రదేశాలలో పిచ్చి మొక్కలు అడవి మాదిరిగా పెరిగి విష సర్పాలకు నిలయంగా మారి ఏ సమయంలో ప్రమా దం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనావాసాల మధ్యనే ఇటువంటి పరిస్థితిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ‘చెవిటి వాడి ముందు శంఖం’ ఊదినట్టే అవుతోందని వాపోయారు. శ్రీ లీలావతి పబ్లిక్ స్కూల్ సమీపంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉందని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవటంతోపాటు పందులను నిర్మూలించాలని కోరుతున్నారు.