కృష్ణ

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 21: గడిచిన నాలుగేళ్లల్లో రాష్ట్రంలో గణనీయమైన పారిశ్రామికాభివృద్ధి సాధించినట్లు ఎమ్మెల్సీ , టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు తెలిపారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పర్చాలన్న ధ్యేయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి ఫలిస్తోందన్నారు. ఇప్పటి వరకు విశాఖపట్నం వేదికగా మూడు పర్యాయాలు పెట్టుబడుల సదస్సులు నిర్వహించి వందలాది పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి తీసుకు వచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పెట్టుబడుల సదస్సుల ద్వారా 1437 కంపెనీలతో ఎంఓయులు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఎంఓయులు కుదుర్చున్న ప్రతి కంపెనీకి భూములు కేటాయింపు ప్రక్రియ శరవేగంగా జరుగుతోందన్నారు. ఒకే విధానంతో పరిశ్రమలను అభివృద్ధి చేయడం కాకుండా 12 విధానాలతో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి పరిశ్రమకైనా 15 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బూరగడ్డ రమేష్ నాయుడు, టీడీపీ జిల్లా కార్యదర్శి పివి ఫణికుమార్, కృష్ణా మిల్క్ యూనియన్ డైరెక్టర్ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.