కృష్ణ

ప్రమాదపుటంచున వ్యవసాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు, సెప్టెంబర్ 21: పాలకుల నిర్లక్ష్యపు విధానాల వల్ల మన వ్యవసాయరంగం ప్రమాదపుటంచున ఉన్నదని, విద్య, వైద్యం తరహాలో ఈ రంగానికి కూడా కార్పొరేట్ శక్తులు వచ్చే అవకాశమున్నదని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేసారు. ఇక్కడ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ మండలంలోని కాటూరులో తాను నిర్వహించిన రైతు ముఖాముఖిలో ఈ ప్రాంత రైతులు అనేక విషయాలను తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. 15 లక్షల రూపాయల విలువైన భూమిని రుణం కోసం హామీగా పెడితే బ్యాంకులు కనీసం ఐదు లక్షలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సబ్సిడీల మంజూరులో కూడా రాజకీయ జోక్యం, ప్రజా ప్రతినిధుల సిఫార్సులు అవసరం కావడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రైతు కూలీల కొరతను అధిగమించేందుకు వ్యవసాయరంగాన్ని యాంత్రీకరణ వైపు నడపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, అందుకు అవసరమైన యంత్రాలను సబ్సిడీపై అందించాలన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయరంగానికి అనుసంధానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు, వ్యవసాయ కళాశాలల విద్యార్థులకు ప్రాంతాల వారీగా పరిస్థితులకు అనుగుణంగా యంత్రాలు రూపొందించే ప్రాజెక్టులను అప్పగించాలన్నారు. ఈ సందర్భంగా పురుగుమందులు వెదజల్లే డోన్‌ను కనిపెట్టిన గోపిరాజును ఆయన అభినందించారు.

అవసరమైతే రాజకీయ రంగప్రవేశం
వ్యవసాయ ఆధారిత దేశంలో వ్యవసాయరంగం పటిష్టంగా ఉండాలని, తొలిదశలో తాను రైతాంగ సమస్యలపై దృష్టి పెట్టానని చెప్పారు. సమస్యల సమాహారాన్ని, పరిష్కారమార్గాలతో కలిపి ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తానని, అప్పటికీ పరిష్కారం కాకుంటే తన రాజకీయ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పటివరకు తన చారిటబుల్ ట్రస్టు ద్వారా సేవలు అందిస్తున్నానని చెప్పారు. స్ధానిక విశ్వశాంతి పాఠశాలలో విద్యార్థుల నుద్ధేశించి ఆయన సాయంత్రం ప్రసంగించారు.