కృష్ణ

నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువూరు: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అంత్యోదయ దివస్ కార్యక్రమాన్ని తిరువూరులో జడ్పీ బాలికోన్నతపాఠశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం మంగళవారం ప్రారంభించారు. దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్‌అన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధికల్పన ధ్యేయంగా అంత్యోదయ దివస్ నిర్వహిస్తున్నట్లుతెలిపారు. అక్టోబర్ 18 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, జిల్లాలో 40 వేల మంది నిరుద్యోగులకు వచ్చే ఆరు నెలల్లో శిక్షణతో పాటు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ వెంకట్రామిరెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి రమేష్, డీఆర్టీ ఏపీడీ చంద్రశేఖరరాజు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి, సర్వశిక్షభియాన్ ప్రాజెక్టు అధికారి ప్రసాదరావు, నూజివీడు ఆర్‌డీవో రంగయ్య, మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, ఎస్సీ కమిషన్ సభ్యురాలు సుధారాణీ, జడ్పీటీసీ సభ్యురాలు విజయబిందు, ఎంపీపీ గద్దె వెంకటేశ్వరరావు, నగరపంచాయితీ చైర్‌పర్సన్ మరకాల కృష్ణకుమారి, వైస్ చైర్మన్ నరసింహారావు పాల్గొన్నారు.