కృష్ణ

చిత్తశుద్ధితో ఓటర్ల నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యతను గుర్తు పెట్టుకుని ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బూత్ కన్వీనర్లకు సూచించారు. మంగళవారం స్థానిక గొరిపర్తి వారి కల్యాణ మండపంలో బూత్ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి రవీంద్ర ఓటు ప్రాధాన్యతను వివరించారు. మచిలీపట్నంలో జనాభా పెరుగుతున్నా ఓటర్ల సంఖ్య తగ్గుతోందన్నారు. ప్రతి ఒక్కరూ దీనిపై దృష్టి సారించి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమం మాదిరిగా నిర్వహించాలన్నారు. ఇటీవల శిక్షణ పూర్తి చేస్తున్న బూత్ స్థాయి కన్వీనర్లు తమ వంతు బాధ్యతగా వార్డుల్లో పర్యటించి ఓటు లేని వారిని గుర్తించి వారిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. 2014 సంవత్సరం నాటికి బందరు నియోజకవర్గంలో లక్షా 82వేల 284 మంది ఓటర్లుగా ఉండగా నేడు 2018 నాటికి ఆ సంఖ్య లక్షా 51వేల 932కు తగ్గడం బాధాకరమన్నారు. 44వేల 836 ఓట్లు గల్లంతయ్యాయని వీటిని గుర్తించి తిరిగి ఓటరుగా నమోదు చేయించాలన్నారు. గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఓట్లు గల్లంతు కావడం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. నూతనంగా సాధికార సర్వేలో ఆధార్ అనుసంధానంతో చాలా ఓట్లు తొలగినట్టు తెలుస్తోందన్నారు. గతంలో ఇంత పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతైన పరిస్థితి లేదని మంత్రి పేర్కొన్నారు. ఓటర్ల నమోదుకు నెల రోజులు మాత్రమే సమయం ఉందని, ప్రతి ఒక్క కార్యకర్త తమ తమ పరిధిలో ఓటర్ల నమోదుకు కృషి చేయాలని మంత్రి రవీంద్ర కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బూరగడ్డ రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ నివేశన స్థలాలు

*ఆర్డీవో ఉదయభాస్కర్

కూచిపూడి, సెప్టెంబర్ 25: మొవ్వ మండలంలోని పేద వర్గాలకు నివేశన స్థలాలు పంపిణీ చేసేందుకు అవసరమైన స్థలాల కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని బందరు ఆర్డీఓ ఉదయభాస్కర్ తెలిపారు. మంగళవారం మొవ్వ తహశీల్దార్ కార్యాలయంలో రికార్డుల తనిఖీ అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎకరాకు రూ.25లక్షలు వంతున ప్రభుత్వం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నదన్నారు. ప్రభుత్వ ధరకు అమ్మేందుకు రైతులను ప్రోత్సహించాలని తహశీల్దార్ బి రామానాయక్ తదితరులకు ఆయన సూచించారు. మొవ్వ గ్రామంలో 150 మంది అర్హులైన పేదలకు నివేశన స్థలాలు పంపిణీ చేసేందుకు న్యాయ స్థానంలో పిటీషన్ దాఖలు చేసిన కక్షిదారులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు అధికారులు, గ్రామ పెద్దలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం తహశీల్దార్ రామానాయక్ అధ్యక్షతన జరిగిన మండల ఆహాల సలహా సంఘం సమావేశంలో జెడ్పీటీసీ చిమటా విజయశాంతి, టీడీపీ మండల అధ్యక్షుడు తాతా వీర దుర్గాప్రసాద్, వైసీపీ మండల అధ్యక్షుడు రాజులపాటి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.