కృష్ణ

విద్యా సంస్థల బంద్ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: విద్యారంగంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ సక్సెస్ అయింది. బంద్ సందర్భాన్ని పురస్కరించుకుని దాదాపుగా ఎక్కువ సంఖ్యలో పాఠశాలలు, కళాశాలలు ముందుగానే సెలువులు ప్రకటించగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొన్ని ప్రభుత్వ పాఠశాలలను యధావిధిగా కొనసాగిస్తుండటంతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగి విద్యార్థులను స్కూల్స్ నుండి పంపివేశారు. విద్యాసంస్థల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించని ప్రభుత్వం బంద్‌కు పిలుపునిస్తే నిరంకుశంగా అణగదొక్కేందుకు ప్రయత్నించటం శోచనీయమన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు విద్యార్థులను విరివిగా వినియోగించుకునే పాలకులు విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా ఉంటున్నందుకు ఆందోళనకు దిగితే సిలబస్ పూర్తికావటం లేదని, స్కూల్స్ వర్కింగ్ డేస్ తగ్గిపోతున్నాయని చెబుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలను, స్కూల్స్‌లో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చాట్ల సుధాకర్, కె దేవేందర్‌నాధ్, టి పోతురాజు, వంశీ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

వలస నేతకు అభివృద్ధి ఎలా కనిపిస్తుంది?

మైలవరం, సెప్టెంబర్ 25: రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో గత నాలుగేళ్ళుగా మైలవరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై మైలవరం సెంటర్‌లో బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, అభివృద్ధి జరగలేదని చెబుతున్న వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్(కేపీ) అందుకు సిద్ధమేనా అని తెలుగు తమ్ముళ్ళు సవాల్ విసిరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్లతో సమావేశంలో ఏఎంసి మాజీ చైర్మన్ ధనేకుల సాంబశివరావు, ఎంపిపి లక్ష్మి, జడ్పీటిసి రాము, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గంజి రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పోతురాజు, రాధాకృష్ణ తదితరులు మాట్లాడుతూ అభివృద్ధిని కళ్ళుండీ చూడలేని కబోదులని ధ్వజమెత్తారు. గత తొమ్మిదేళ్ళుగా నియోజకవర్గంలో ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, పదవీ వ్యామోహంతో కోట్లాది రూపాయలు కుమ్మరించి గెలవాలనే కుట్రలతో నిన్నగాక మొన్న వచ్చిన కేపీకి ఏం తెలుసునని ప్రశ్నించారు. గడచిన 40 ఏళ్ళలో జరగని అభివృద్ధి కేవలం నాలుగేళ్ళలోనే జరిగిందని వారు స్పష్టం చేశారు. అభివృద్ధి అనేది నిత్యం జరిగే ప్రక్రియ అని జరగాల్సిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని హితవు పలికారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో వాకింగ్ వీరుడు వారానికి నాలుగు రోజులు నడిచి రెండు రోజులు కోర్టు మెట్లు ఎక్కే జగన్, ఆయనకు తోడుగా కేపీ ప్రజలను ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. రాజన్న రాజ్యం అని చెబుతున్న కేపీ రాజన్న రాజ్యంలో అధికారులు జైళ్ళ పాలయ్యారని మళ్ళీ అటువంటి రాజ్యం ఎవరూ కోరుకోరని పేర్కొన్నారు. మంత్రి ఉమ హయాంలో నియోజకవర్గంలో 22 ఎత్తిపోతల పధకాలను ఏర్పాటు చేసి, రాష్ట్రంలో ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నారని రాబోయే రోజులలో రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు సమస్య ఉండబోదని స్పష్టం చేశారు. గ్రామాలలో రోడ్లు, డ్రైన్లు, సిసి రోడ్లు, విద్యుత్, విద్య, పెన్షన్లు, రేషన్ కార్డులు, మరుగుదొడ్లు, పక్కా ఇళ్ళ నిర్మాణం తదితర కార్యక్రమాలను నిర్వహించామని వీటిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు.