కృష్ణ

‘పోలవరం’లో అవినీతి వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట: పోలవరం పనుల్లో జరుగుతున్న అక్రమాలను తన నివేదికలో కాగ్ ఎండగట్టిందని, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని వైసీపీ విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మంగళవారం మాట్లాడుతూ జూలై 2017 వరకూ ప్రభుత్వం నాణ్యతా పరిశీలన విభాగాన్ని ఏర్పాటు చేయకుండానే పనులు చేయించారని, ప్రాజెక్టు అథారిటీ 2014 మే నెలలో ఏర్పాటు చేసి ఒప్పందం చేసుకోవాలని ఫ్రభుత్వాన్ని కోరినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఎంపి రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కు హెడ్ వాటర్ వక్స్ పూర్తి చేసే సామర్థ్యం లేదని ట్రిబునల్ కమిటీ చెప్పినా పనులు ఆ సంస్థకే అప్పగించారన్నారు. రూ.66.59 కోట్ల పెర్‌ఫార్‌మెన్స్ నిధులు సెక్యూరిటీ కింద కాంట్రాక్టర్ నుండి వసూలు చేయాల్సి ఉన్నా వసూలు చేయలేదని, తదితర ఆరోపణలు ఆయన పేర్కొన్నారు. కాగ్ నివేదికలో వివిధ అంశాలు బట్టబయలు అయ్యాయని పేర్కొంటూ ప్రభుత్వ అవినీతి పోలవరానికే పరిమితం కాకుండా రాజధాని నిర్మాణం, భూగర్భ జల వనరుల రవాణా అంశాల్లోనూ పెచ్చుమీరిందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు భద్రత కరువైందని, అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎంఎల్‌ఎ సోమలను నక్సలైట్‌లు కాల్చి చంపడంపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందో అర్ధం అవుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్, వైస్ చైర్మన్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

జూ.కాలేజీలో ఎంసెట్ కోచింగ్ సెంటర్

అవనిగడ్డ, సెప్టెంబర్ 25: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఎంసెట్ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి పి ఉదయలక్ష్మి తెలిపారు. కళాశాల ఆవరణలో మంగళవారం సాయంత్రం జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో ఆమె ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఇంటర్ విద్య మొత్తం ఉచితం చేశామని, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉపకార వేతనాలు, వసతి గృహాలు సమకూరుస్తున్నట్లు ఉదయలక్ష్మి తెలిపారు. ఉపకార వేతనాలను నేరుగా విద్యార్థుల ఖాతాలోకి జమ చేయటం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఉపకార వేతనం ద్వారా రూ.3,400 కోట్లు వ్యయం చేయటం జరుగుతుందని, దానిలో బీసీ వర్గాలకు రూ.1400 కోట్లు వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 25 కళాశాలల్లో ఎంసెట్ కోచింగ్ నిర్వహించటం ద్వారా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా కోచింగ్ ఇవ్వటం జరుగుతుందని, అందుకు ఉపాధ్యాయులు ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. కంప్యూటర్లు, డిజిటల్ విద్యతో పాటు ధ్యాన తరగతులు కూడా నిర్వహించటం ద్వారా విద్యార్థుల్లో శక్తిని పెంచుతున్నామన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన తల్లిదండ్రులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు మత్తి శ్రీనివాసరావు, కె ఈశ్వరరావు, ప్రిన్సిపాల్ సనకా నాగమునీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.