కృష్ణ

నేత్ర పర్వంగా దేవీ అలంకారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్) : దేవీ శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని పలు ఆలయాలలో కొలువైన అమ్మవార్లు సర్వాభరణాలతో నేత్ర పర్వంగా భక్తులకు దర్శనమిచ్చారు. రాబర్ట్‌సన్‌పేట శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రీ పార్వతీదేవిని రజిత కవచంతో, శ్రీ కన్యకాపరమేశ్వరి దేవిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. గీతా మందిరంలోని శ్రీ వాసవీ మాతను శ్రీ బాలాత్రిపురి సుందరిగా, సర్కిల్‌పేట శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలోని శ్రీభ్రమరాంబదేవిని శ్రీ అన్నపూర్ణ దేవిగా, శ్రీ మణిద్వీపేశ్వరి ఆలయంలోని అమ్మవారిని శ్రీ విజయలక్ష్మీ దేవిగా, దత్తాశ్రమంలోని అమ్మవారిని శ్రీ గౌరీదేవిగా, త్రిశక్తి పీఠంలోని అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా, రేవతి సెంటరులోని శ్రీ గంగానమ్మ తల్లిని శ్రీ బాలాత్రిపుర సుందరిగా, శక్తి గుడిలోని అమ్మవారిని కాళికాదేవిగా అలంకరించారు. గీతా మందిరంలోని శ్రీ లలితా పరమేశ్వరి, ఈడేపల్లి నారాయణపురంలోని శ్రీ శివ కనకదుర్గదేవి, ఖొజ్జిల్లిపేట శ్రీ బాలాత్రిపుర సుందరి, రాబర్ట్‌సన్‌పేట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలోని శ్రీ పర్వత వర్ధని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ విజయదుర్గాదేవిలను కన్నుల పండువగా అలంకరించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు.
ఆయల్ కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి
జి.కొండూరు, అక్టోబర్ 10: చమురు ఉత్పత్తి సంస్థల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మైలవరం ఏఎంసీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకులు పులిపాక థామస్ డి మాండ్ చేశారు. జి.కొండూరులో ఆ యన బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పెట్రోలియం కంపెనీలకు ఇక్కడి రైతుల భూములు సేకరించారన్నారు. వారికి కనీస ధరలు కూడా చెల్లించలేదన్నారు. ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇస్తామని మాట తప్పారన్నారు. నిరుద్యోగ స మ స్య పెరిగిందన్నారు. నిరుద్యోగ భృతి కింద కొంతమందికి రూ. 1 వెయ్యి మాత్రమే మంజూరు చేయడం ఎన్నికల స్టంట్ అని కొట్టిపారేశారు. ప్రభు త్వ ఉద్యోగాలు భర్తీ చే యడం లేదన్నారు. ఆయిల్ కంపెనీలు సిఎస్‌ఆర్ కింద జి.కొండూరు మండల పరిధిలోని గ్రామాలకు నిధు లు కూడా కే టాయించడం లేదన్నా రు. టవర్ లైన్లు, పైపులైన్లు కారణంగా రైతులు చాలా నష్టపోతున్నారన్నారు. భూ ములు విలువ కోల్పోతున్నాయన్నారు. కృష్ణానది చెంతనే ఉన్నా సా గునీరు అందుబాటులో లేదన్నారు. తారకరామ ప థకం సవ్యంగా పనిచేయడం లేదన్నా రు. నేడు పంటలు ఎండిపోతున్నాయన్నారు. మంత్రి ఉమా గొప్పగా చెప్పుకుంటున్న లిఫ్టులు నీళ్ళు లేని కారణంగా పనిచేయడం లేదన్నారు. పట్టిసీమ వల్ల డెల్టాకు మాత్రమే న్యాయం జరుగుతోందన్నారు. మంత్రి ఉమా ఈప్రాంతంలో చెప్పుకోదగ్గ ఒక్క పెద్ద ప్రాజెక్టును కూడా కేటాయించలేదన్నా రు. ఇప్పటికైనా మంత్రి ఉమా కళ్ళు తెరచి నిరుద్యోగ సమస్యను, సాగునీ టి సమస్యను పరిష్కరించాలని థా మస్ డిమాండ్ చేశారు.