కృష్ణ

తుపాను బాధితుల్ని పరామర్శించని జగన్ రాజీనామా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పాదయాత్రలంటూ ప్రజల్ని మోసం చేస్తూ కేంద్రంతో కలిసి కుట్ర రాజకీయాలకు పాల్పడుతూ ప్రజల కష్టాలను చూసి ఆనందపడే ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని శాసనమండలిలో ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో విలేఖరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తూ తుపాను వల్ల నష్టపోయిన ప్రజల్ని పరామర్శించకుండా కనీసం వారిని కనె్నతె్తైనా చూడకుండా హైదరాబాద్‌కు ఉడాయించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. తుపాను ప్రాంతానికి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగన్ రాత్రికి రాత్రే అక్కడ నుంచి దుకాణం సర్దేయడం చూస్తేనే ఆయనకు ప్రజల పట్ల ఎంతటి దురభిప్రాయం ఉందో అర్థమవుతోందన్నారు. ఇలాంటి వ్యక్తి ప్రతిపక్ష నేత పదవికి అనర్హుడని, ప్రజల ఓట్లతో గెలిచి వారి సొమ్ముతో ప్రభుత్వ సౌకర్యాలు అనుభవిస్తున్న వ్యక్తి వెంటనే వాటిని వదిలేసి జనానికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. చీటర్స్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర పర్యటనపై అభ్యంతకర ప్రకటనలు చేయడం ఆయనలోని మానసిక రుగ్మతను తెలియజేస్తోందన్నారు. రూ. 2800 కోట్ల వరకు నష్టపోయిన ఉత్తరాంధ్రకు సాయం చేయమని అడిగే ధైర్యం బీజేపీ తొత్తులైన జగన్, పవన్‌కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణలకు లేదని బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు.