కృష్ణ

శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు: వాడవాడలా జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కోడూరు శ్రీ గంగానమ్మతల్లి, విశ్వనాధపల్లి శ్రీ నాంచారమ్మ తల్లి, వేణుగోపాలపురం శ్రీ అంబికాదేవి, కోడూరు సంత మా ర్కెట్ పక్కన ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయంలోని అమ్మవార్లు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాలలో ప్రత్యేక పూ జలు, నైవేద్యాలు సమర్పించారు. విశ్వనాధపల్లి నాంచారమ్మతల్లి ఆలయ కార్యనిర్వహణాధికారి టివివి మోహనరావు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విశేష కృషి చేస్తున్నారు.
ఆకట్టుకున్న చిన్నారుల భరతనాట్యం
మండవల్లి, అక్టోబర్ 15: మండల కేంద్రం మండవల్లిలో దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అభినవ నాట్యమండలి అకాడమీ నాట్యచారిణి కె జ్యోతి ఆధ్వర్యంలో కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలో చిన్నారులు విశేష ప్రతిభ కనబరిచారు. చిన్నారులు అదిగో అల్లదిగో.., హరిగిరి నందిని.., దండాలు దండాలు అమ్మోరు తల్లో.., మూషిక వాహన.. వంటి శాస్ర్తియ సంగీతానికి అనుగుణంగా చేసిన నృత్యం పలువురుని ఆకట్టుకుంది. ఆలయ నిర్వహకులు, భక్తులు నాట్యచారిణి జ్యోతి, నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు బహుమతులను అందజేశారు.