కృష్ణ

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తుందని, ఇందుకు మన జిల్లాలో మీకోసం కార్యక్రమం ద్వారా సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కార మార్గాలు చూపుతున్నామని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం పేర్కొన్నారు. పామర్రులో సోమవారం నియోజకవర్గ స్థాయిలో జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వినతిపత్రాలు స్వీకరించి మాట్లాడారు. మీకోసంతో పాటు మీ-సేవ ద్వారా కూడా అర్జీలు స్వీకరించి ఆయా ప్రభుత్వ సంస్థల ద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నామని వివరించారు. వివిధ సమస్యలపై అర్జీలు అందించిన వారికి ధృవపత్రాలను అందించటం జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రతి రెవెన్యూ కార్యాలయం వరకు మీకోసం అర్జీలు స్వీకరిస్తున్నామన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాలు, భూ సమస్యలకు, డ్రైవింగ్ లైసెన్సులు, వివిధ ప్రభుత్వ సేవల కోసం మీ-సేవ ద్వారా అర్జీలు చేసుకోవచ్చన్నారు. చెత్త నుండి సంపద తయారు చేస్తూ ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఏర్పరుస్తున్నట్లు తెలిపారు. మొక్కలు విరివిగా నాటిస్తున్నామని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. సభలో పాల్గొన్న పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలకు సేవలందిస్తుందన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టి అర్హులైన వారికి మంజూరు చేస్తున్నాని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విజయ కృష్ణన్, డీఆర్‌డీఎ పీడీ చంద్రశేఖరరాజు, గుడివాడ ఆర్డీఓ సత్యవాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.