కృష్ణ

పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: రాష్ట్రంలోని పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కిస్ట్ఫర్ తిలక్ అన్నారు. స్థానిక సాయిబాబా ఆవరణలో సోమవారం కాంగ్రెస్ కార్యకర్తల ఒక రోజు శిక్షణ కార్యక్రమం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గనే్న కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన తిలక్ మాట్లాడుతూ దేశ ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. కార్యకర్తలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండేందుకు రాహుల్‌గాంధీ శక్తి ప్రాజెక్టుని నెలకొల్పారన్నారు. సెల్‌ఫోన్‌లో ఓటర్ ఐడీ నెంబర్‌ని మెసేజ్ చేసి 8108048888కు ఎస్‌ఎంఎస్ చేస్తే రాహుల్‌గాంధీ మాట్లాడతారని తెలిపారు. ఈ శక్తియాప్‌లో ప్రతి మండలం నుంచి రెండువేల మంది కార్యకర్తలు చేరేలా నాయకులు కృషి చేయాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాతో పాటు డ్వాక్రా గ్రూపులకు రూ.2లక్షలు రుణమాఫీ, ప్రతిపేద కుటుంబానికి ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్‌లు, పెన్షన్ల పెంపు, ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయటం లాంటి కార్యక్రమాలను చేయనుందని, వీటిని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని కిష్ట్ఫర్ తిలక్ కోరారు. ఈ సమావేశంలో సమాచార మాజీ కమీషనర్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు లాం తాంతియాకుమారి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహన్‌రావు, పామర్రు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి మొవ్వా మోహన్‌రావు, యువజన కాంగ్రెస్ నాయకుడు చేకూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల సెస్ బకాయలు రూ.32 కోట్లు
గుడివాడ, అక్టోబర్ 22: జిల్లా గ్రంథాలయ సంస్థకు స్థానిక సంస్థల నుండి రూ.32కోట్ల సెస్ బకాయిలు వసూలు కావాల్సి ఉందని ఆ సంస్థ చైర్మన్ బండారు హనుమంతరావు చెప్పారు. సోమవారం స్థానిక షాగులాబ్‌చంద్ ప్రథమశ్రేణి శాఖా గ్రంథాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బండారు విలేఖర్లతో మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 95బుక్ డిపాజిట్ సెంటర్లను నిర్వహిస్తున్నామని, మరో 55సెంటర్ల నిర్వహణకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో 109 గ్రంథాలయాలు ఉన్నాయని, వీటిలో బంటుమిల్లి, వణుకూరు, గంపలగూడెం, పెనమలూరుల్లో నూతన గ్రం థాలయ భవన నిర్మాణాలను చేపట్టాల్సి ఉందన్నారు. విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం ప్రధాన గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేసేందుకు రంగం సిద్ధమైందన్నారు. గ్రంథాలయాల్లో సిబ్బంది కొరతను త్వరలో అధిగమిస్తామన్నారు. సర్వీస్ కమిషన్ ద్వారా 30 లైబ్రేరియన్ల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. ఆన్ డిమాండ్ రిజిష్ట్రీ ద్వారా విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు అవసరమైన పుస్తకాలను వె ంటనే అందుబాటులోకి తెస్తున్నామన్నారు. గుడివాడ ప్రథమశ్రేణి గ్రంథాలయ పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం గ్రంథాలయ పాఠకులతో మాట్లాడా రు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారిణి కే రమాదేవి పాల్గొన్నారు.

వైఎస్సార్సీపీతోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యం
*వసంత కృష్ణప్రసాద్
జి.కొండూరు, అక్టోబర్ 22: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే ఎపి అభివృద్ధి సాధ్యమని మైలవరం వైకాపా ఇన్‌చార్జ్ వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. చెరువుమాధవరంలో ఆదివారం రాత్రి జరిగిన వైసిపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జలవనరుల శాఖ మంత్రి అయి ఉండి కూడా సాగునీరు ఇవ్వలేక పోతున్నారని మంత్రి ఉమాను విమర్శించారు. ఇళ్ళస్థలాల విషయంలో రాజకీయాలు తగవన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్ళస్థలాలు ఇవ్వాలన్నారు. తారకరామ ఎత్తిపోతల పథకంను సవ్యంగా నిర్వహిస్తే సాగునీటి కొరత కొంత తీరుతుందన్నారు. మంత్రి ఉమాను, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పనికిమాలిన వారంటూ విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి పెచ్చరిల్లిపోయిందన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మంత్రి ఉమ కల్లబొల్లి మాటలు చెబుతూ మళ్ళీ బూటకపు వాగ్దానాలు ఇస్తున్నాడన్నారు. గత నాలుగేళ్ళలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. స ంక్షేమ పథకాలన్నీ పచ్చచొక్కాలకే పరిమితమయ్యాయన్నారు. రాజన్న రాజ్యంతోనే పేదవాళ్ళకు న్యాయం జరుగుతుందన్నారు. వైసిపి మండల కన్వీనర్ మందా జ క్రధరరావు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.