కృష్ణ

మీకోసం అర్జీలను సత్వరం పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్): మీకోసంలో వచ్చే అర్జీలను సత్వరం పరిష్కరించాలని మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడ) వైస్ చైర్మన్ పి విల్సన్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మీకోసంలో వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణం పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. పెండింగ్ అర్జీలను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

విద్యాప్రదాత ‘సర్వా’ మృతి
మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 22: ప్రముఖ విద్యాప్రదాత, సేవాస్వభావి అయిన సర్వా రామ్మోహన ప్రసాద్ (75) సోమవారం తుది శ్వాస విడిచారు. పట్టణానికి చెందన రామ్మోహన ప్రసాద్ గత రెండు వారాలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. సోమవారం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రామ్మోహన ప్రసాద్ పద్మావతి హిందూ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేసిన ఆయన ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు. గడిచిన 23 యేళ్లుగా బ్రాహ్మణ ఎడ్యుకేషనల్ సర్వీస్ ట్రస్ట్ ద్వారా వందలాది మంది ప్రతిభ గల పేద బ్రాహ్మణ విద్యార్థులకు లక్షలాది రూపాయలు ఉపకార వేతనాలు అందచేస్తున్నారు. పదవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రతి యేటా రూ.15లక్షలు మేర ట్రస్టు ద్వారా ఉపకార వేతనాలు అందచేస్తున్నారు. అలాగే క్రమపాఠి, ఘనపాఠి పట్టా పొందిన బ్రాహ్మణ బాలబాలికలు, సంగీతంలో డిప్లమో, డిగ్రీ పొందిన బ్రాహ్మణ బాల బాలికలకు సైతం ఉపకార వేతనాలు అందిస్తున్నారు. ఎంతో మంది ప్రతిభావంతులైన పేద బ్రాహ్మణులకు విద్యను దగ్గర చేసి వారి ఉన్నతికి కృషి చేస్తూ వచ్చారు. రామ్మోహన ప్రసాద్‌కు ఇరువురు కుమారులు. ఆయన మృతి పట్ల పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి రామకృష్ణారావు, బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా ఆర్గనైజర్ పివి ఫణికుమార్, హిందూ కళాశాల అనుబంధ సంస్థల పాలకవర్గ అధ్యక్షుడు డా. బి ధన్వంతరి ఆచార్య, భావతరంగిణి మాస పత్రిక సంపాదకుడు భవిష్య, హిందూ కళాశాల విశ్రాంత అధ్యాపకులు ఎస్ వెంకటేశ్వరరావు, ఇండియన్ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ కార్యదర్శి గొరిపర్తి పాపరాజు, ముత్తేవి రామకృష్ణ, బందరుబంధువు జొన్నలగడ్డ లక్ష్మీకాంత్ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. సర్వా రామ్మోహన ప్రసాద్ అంత్యక్రియలు మంగళవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.