కృష్ణ

కలెక్టరేట్‌పై చిన్నచూపేలా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ఐఎస్‌ఓ సర్ట్ఫికేట్ సైతం సొంతం చేసుకున్న జిల్లా కలెక్టరేట్ నేడు ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. జిల్లా పాలనా వ్యవహారాలకు కేంద్ర బింధువుగా ఉండాల్సిన కలెక్టరేట్ నేడు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కలెక్టరేట్ వైపు చూసే నాధుడే కరువయ్యాడు. నిత్యం అధికారులు, ప్రజలతో కళకళలాడాల్సిన కలెక్టరేట్ అందుకు భిన్నంగా నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది. కారణంగా అధికారుల ఉదాశీనత, పాలకుల వైఫల్యమే. కలెక్టరేట్‌లో కూర్చుని పాలనా వ్యవహారాలను చక్కదిద్దాల్సిన అధికారులు క్యాంప్‌ల పేరుతో విజయవాడకే పరిమితమవుతుండటం గమనార్హం. ప్రజా సమస్యలపై స్పందించే కలెక్టర్ బి లక్ష్మీకాంతం సైతం కలెక్టరేట్‌కు దూరమైపోయారు. రాజధాని నగరమైన విజయవాడలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాల వల్ల కలెక్టరేట్ వైపే కనె్నత్తి చూడటం లేదు. దీంతో కలెక్టరేట్‌లో తమకంటూ సొంత కార్యాలయాలు ఉన్న జిల్లా స్థాయి అధికారులు సైతం కలెక్టర్‌కు తామేమీ తక్కువ కాదంటూ వారు కూడా విజయవాడలోనే మకాం వేసి కూర్చుంటున్నారు. దీంతో కలెక్టరేట్ ప్రతిష్ఠ మసకబారిపోతోంది. పరదేశీయుల పాలనలో కలెక్టరేట్ తనకంటూ ఒక ప్రతిష్ఠను ఇనుమడింప చేసుకుంది. ఎంతో మంది కలెక్టర్లు ఇక్కడి నుండే పాలన సాగించారు. కానీ గడిచిన 15 యేళ్లుగా కలెక్టరేట్ అంటే ఓ మండల స్థాయి కార్యాలయం మాదిరిగా మారిపోయింది. బందరులో ఒక రోజు కూడా ఏ అధికారి నిద్ర చేయలేకపోతున్నారు. కారణాలు అనేకం ఉన్నాయి. కలెక్టర్ ఎక్కడ ఉంటే తామూ అక్కడే అన్న రీతిలో జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారు. జిల్లాకు కలెక్టర్‌గా సేవలు అందిస్తున్న బి లక్ష్మీకాంతం తొలినాళ్లల్లో జిల్లా కేంద్రంకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారానికి రెండు మూడు రోజులు ఇక్కడే మకాం చేశారు. కానీ పరిస్థితులు ఆయన్ని బందరులో ఉండనివ్వడం లేదు. తరచూ సీఎం కార్యక్రమాల వల్ల ప్రోటోకాల్ పేరుతో విజయవాడలోనే ఉండిపోవల్సి వస్తోంది. కానీ క్రమం తప్పకుండా ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే మీకోసం కార్యక్రమానికి కలెక్టర్ హాజరవుతూ వచ్చారు. కానీ గడిచిన మూడు నెలలుగా సోమవారం జరిగే మీకోసంకు కూడా ఆయన హాజరు కాలేకపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు తీరులో కలెక్టర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కలెక్టర్ అంటే లక్ష్మీకాంతమే అన్న పేరును ప్రజల్లో తెచ్చుకున్నాయి. అయితే ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే జిల్లా స్థాయి ‘మీకోసం’ కార్యక్రమాన్ని ఆయన పక్కన పెట్టారు. ప్రజల వద్దకే పాలన అంటూ ప్రతి సోమవారం ఏదో ఒక మండల కేంద్రంలో జిల్లా స్థాయి మీకోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆలోచన మంచిదే కానీ, ఆయన తీసుకున్న నిర్ణయం కలెక్టరేట్ ప్రతిష్ఠను దెబ్బ తీస్తోందని ప్రజలు వాపోతున్నారు. కలెక్టర్ నిర్ణయం వల్ల పేరు గొప్ప ఊరు దిబ్బగా మారిన కలెక్టరేట్‌ను గాలికి వదిలేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మండల కేంద్రాల్లో జిల్లా స్థాయి మీకోసం నిర్వహిస్తే మహా అయితే ఆ గ్రీవెన్స్‌కు సమీపంలోని నాలుగు ఐదు మండలాల ప్రజలు మాత్రమే వేస్తారు. దీన్ని జిల్లా స్థాయి మీకోసం ఎలా అంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో మాదిరిగా కలెక్టరేట్‌లో నిర్వహించే మీకోసంకు జిల్లా నలుమూలల నుండి ప్రజలు వచ్చి తమ సమస్యలను నేరుగా కలెక్టర్‌కు చెప్పుకునే అవకాశం ఉంది. కానీ నేడు ఆ అవకాశాన్ని కోల్పోతున్నామని సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన పలువురు అర్జీదారులు పేర్కొన్నారు. కలెక్టర్ ఉంటారన్న ఆశతో వచ్చిన తమకు నిరాశే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పెషల్ గ్రీవెన్స్ పుణ్యమా అంటూ కలెక్టర్ గానీ, జిల్లా అధికారులు గానీ వారంలో ఒక రోజు కూడా జిల్లా కేంద్రానికి రాలేకపోతుండటం గమనార్హం.