కృష్ణ

కవులూరులో ఎయిమ్స్ విద్యార్థుల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు : ధన్వంతరీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా సోమవారం కవులూరులో మంగళగిరి ఎయిమ్స్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు 50 మంది ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో నినాదాలు చేసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన అవగాహన సదస్సులో గ్రామస్తులకు మధుమేహం పరీక్షలు నిర్వహించారు. అనారోగ్య రుగ్మతలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలను చైతన్యపరిచారు. మద్యపానం, ధూమపానం వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. ఆహారపు అలవాట్లలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ రాజశేఖర్, ధన్వంతరీ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ జువ్వా గౌతమ్‌కుమార్, వాలంటీర్ ఈలప్రోలు సీతారామయ్య, అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు, ఎంబీబీఎస్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

మైలవరం పట్టణానికి చంద్రన్న కాంతులు
మైలవరం : గతంలో ఎన్నడూ లేని విధంగా మైలవరం పట్టణం చంద్రన్న కాంతులతో వెలిగిపోతోంది. గత మూడు రోజులుగా మైలవరం పట్టణంలో పంచాయితీ ఆధ్వర్యంలో వీధి స్తంభాలకు ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ బల్బులతో మైలవరం పట్టణం కొత్త కాంతులతో శోభిల్లుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న కాంతులనే పధకం ద్వారా అన్ని గ్రామాలకు ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేయాలన్న తలంపుతో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రత్యేక చొరవతో గుంటూరు నుండి 30 మంది వర్కర్లను ప్రత్యేకంగా రప్పించి యుద్ధ ప్రాతిపదికన మైలవరం పట్టణంలోని 20 వార్డులలో వీధి దీపాలను ఎల్‌ఈడీ బల్బులతోనే ఏర్పాటు చేశారు. దీంతో మైలవరం పట్టణం నూతన శోభను సంతరించుకుంది. పట్టణానికి మొత్తం 3వేల వీధి దీపాలు అవసరం కాగా మొదటి దశలో రెండు వేల వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడి బల్బులను అమర్చారు. మిగిలిన వెయ్యి ఎల్‌ఈడీ బల్బులను రెండోదశలో ఏర్పాటు చేయనున్నట్లు స్పెషలాఫీసర్ ప్రతాప పుల్లయ్య వెల్లడించారు. ఎల్‌ఈడీ కాంతులతో మైలవరం పట్టణం పగటిని తలిపస్తోందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు సంవత్సరాల పాటు ఈబల్బులకు ఎటువంటి ఆటంకాలు ఉండవని, పంచాయితీకి విద్యుత్ పొదుపు కారణంగా విద్యుత్ చార్జీల మోత కూడా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. గృహాలలో కూడా వినియోగదారులు ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.